Share News

Medical Faculty: వైద్య కళాశాలల్లో 309 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతి

ABN , Publish Date - Jul 24 , 2025 | 02:04 AM

వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని వైద్య కళాశాలల అధ్యాపకులకు రికార్డు స్థాయిలో పదోన్నతులు కల్పించారు. 33 విభాగాల్లో 309 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతినిస్తూ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ బుధవారం 3 వేర్వేరు జీవోలు జారీ చేశారు.

Medical Faculty: వైద్య కళాశాలల్లో 309 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతి

  • త్వరలో అసిస్టెంట్‌ నుంచి అసోసియేట్‌ పదోన్నతులు

హైదరాబాద్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని వైద్య కళాశాలల అధ్యాపకులకు రికార్డు స్థాయిలో పదోన్నతులు కల్పించారు. 33 విభాగాల్లో 309 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతినిస్తూ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ బుధవారం 3 వేర్వేరు జీవోలు జారీ చేశారు. పదోన్నతులు పొందిన అధ్యాపకులంతా 15 రోజుల్లో పోస్టింగ్స్‌ ఇచ్చిన కాలేజీల్లో చేరాలని ఆ జీవోలో పేర్కొన్నారు. జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో 32 మంది, జనరల్‌ సర్జరీలో 31, గైనకాలజీలో 22, అనస్థిషియాలో 10, ఆప్తమాలజీ, రేడియాలజీ విభాగాల్లో 17 చొప్పున, డెర్మటాలజీలో 16, పిడియాట్రిక్స్‌లో 14, ఈఎన్‌టీలో 12, ఆర్థోపెడిక్‌లో 11, మైక్రో బయాలజీలో 10, బయో కెమిస్ట్రీ, ఎస్పీఎం విభాగాల్లో 9, టీబీసీడీ, ఫిజియాలజీల్లో 8, సైకియాట్రీలో 6, అనాటమీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, ఫార్మ కాలజీల్లో 5, పాథాలజీలో 4, డెంటల్‌ సర్జరీలో ఇద్దరు, రేడియోపతి, పిడోడోంటిక్స్‌, పెరీడోంటిక్స్‌ల్లో ఒక్కొక్కరికి అసోసియేట్‌ నుంచి ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించారు.


ఇక, సూపర్‌ స్పెషాలిటీ విభాగంలో న్యూరో సర్జరీలో 6, ప్లాస్టిక్‌ సర్జరీలో 5, కార్డియాలజీలో 4, యూరాలజీలో ముగ్గురు, నూర్యాలజీ, నెఫ్రాలజీల్లో ఇద్దరు, సర్జికల్‌ ఆంకాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, పిడియాట్రిక్‌ సర్జరీల్లో ఒక్కొక్కరికి పదోన్నతి కల్పించారు. ఇటీవల అదనపు వైద్య విద్యా సంచాలకులుగా (ఏడీఎంఈ)గా పదోన్నతులు పొందిన 44 మంది ప్రొఫెసర్లను ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లుగా, బోధనాస్పత్రుల సూపరింటిండెంట్లుగా పోస్టింగ్స్‌ ఇవ్వగా, 10 మంది మినహా మిగిలిన వారంతా తమకు కేటాయించిన ప్లేసుల్లో జాయినింగ్‌ రిపోర్టు ఇచ్చినట్లు వైద్యవిద్య సంచాలకులు నరేంద్రకుమార్‌ తెలిపారు. త్వరలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు, అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించి.. పారదర్శకంగా పోస్టింగ్‌లు ఇచ్చినందుకు ప్రభుత్వానికి తెలంగాణ టీచింగ్‌ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ బొల్లెపాక కిరణ్‌, సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ మాదాల కిరణ్‌ కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 02:04 AM