Share News

Kaloji Health University: అదంతా ప్రైవేట్‌ కాలేజీల తప్పుడు ప్రచారం

ABN , Publish Date - Jul 13 , 2025 | 05:41 AM

ప్రైవేటు వైద్య కళాశాలల్లో తనిఖీలకు ముందు గానీ, తర్వాత గానీ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేర్కొంది.

Kaloji Health University: అదంతా ప్రైవేట్‌ కాలేజీల తప్పుడు ప్రచారం

  • తనిఖీల సమయంలో లావాదేవీలేమీ జరగలేదు

  • హైదరాబాద్‌లో ఉన్నది రెండు వాహనాలు మాత్రమే

  • క్యాంపు ఆఫీసు కార్యకలాపాల కోసమే వాడుతున్నాం

  • ‘ప్రైవేటుగా వసూళ్లు’పై హెల్త్‌ యూనివర్సిటీ వివరణ

  • ‘‘ఆంధ్రజ్యోతి’’ కథనంపై సీఎం కార్యాలయం ఆరా

  • నివేదిక ఇవ్వాలని ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఆదేశం

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : ప్రైవేటు వైద్య కళాశాలల్లో తనిఖీలకు ముందు గానీ, తర్వాత గానీ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేర్కొంది. కొన్ని ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు వర్సిటీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది. ‘‘ఆంధ్రజ్యోతి’’లో శనివారం ‘‘ప్రైవేటుగా వసూళ్లు’’ శీర్షికన ప్రచురితమైన కథనంపై హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ వివరణ ఇచ్చారు. వర్సిటీ మూడు ప్రభుత్వ వాహనాలను వినియోగించడం లేదని, రెండింటినే వాడుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, అక్కడే రెండు ప్రభుత్వ వాహనాలను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకటి క్యాంపు కార్యాలయ పనులు నిమిత్తం, మరొకటి హైదరాబాద్‌, వరంగల్‌లో పలు సమావేశాలకు హాజరయ్యేందుకు వీసీ వినియోగిస్తున్నట్లు తెలిపారు. స్టైపెండ్‌ విషయంలో పలు కాలేజీల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయని, వాటి ఆధారంగా తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.


ఆయా తనిఖీల్లో చాలా కాలేజీలు స్టైపెండ్‌ చెల్లించడం లేదని గుర్తించామని, కొన్నింటిలో నిబంధనల మేరకు రోగులు, పడకలు లేవని, సర్జరీలు కూడా జరగడం లేదని తెలిపారు. తనిఖీల సందర్భంగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కాగా, ‘‘ఆంధ్రజ్యోతి’’ కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. ఆయా అంశాలపై తక్షణమే విచారణ జరిపి, ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తును సీఎంవో ఆదేశించింది. సీఎంవో ఆదేశాల మేరకు అందుబాటులో ఉన్న ఉన్నతాఽధికారులను హెల్త్‌ సెక్రటరీ రంగంలోకి దించారు. ‘‘ఆంధ్రజ్యోతి’’ కథనంలో పేర్కొన్న ఒక్కో అంశంపై సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు వైద్య కళాశాలలకు తనిఖీలకు వెళ్లిన అధ్యాపకుల వివరాలను తెప్పించుకున్నట్లు సమాచారం.


జగన్‌మోహన్‌ కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై వాదనలు

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో నిధుల దుర్వినియోగం, అక్రమాలు, ఫోర్జరీ కేసులో అరెస్టయిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రావుతో పాటు ఐదుగురిని పది రోజుల కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై మల్కాజిగిరి కోర్టులో శనివారం వాదనలు జరిగాయి. అదే సమయంలో నిందితులు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.


ఇవి కూడా చదవండి..

విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు

కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 05:41 AM