Home » AAP
పంజాబ్ గాయనిగా పేరుతెచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన 35 ఏళ్ల మాన్ 2022లో ఖరార్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మంత్రిగా కీలక శాఖల్లో పనిచేశారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కలేదు. అనూహ్యంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు శనివారం నాడు ప్రకటించారు.
బరువెక్కిన హృదయంతో రాజకీయాలను విడిచిపెట్టాలని నిర్ణయించున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మాన్ తెలిపారు. తన రాజీనామాను స్పీకర్ ఆమోదించాలని కోరారు. పార్టీకి బెస్ట్ విషెస్ తెలిపారు.
ఇండియా కూటమి కింద 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయని, అయితే ఆ తర్వాత జరిగిన హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలో సోలోగానే ఎన్నికల్లోకి దిగాయని సంజయ్ సింగ్ చెప్పారు.
బీహార్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ అన్ని స్థానాలకు తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన ప్రకటన చేశారు.
అకాలీదళ్ సీనియర్ నేత బిక్రమ్ మజిథియాపై విజిలెన్స్ కేసు వ్యవహారంలో ఆప్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విజయ్ ప్రతాప్ బహిరంగ విమర్శలు చేసిన క్రమంలో ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దాడుల సమయంలో మజిథియా భార్య విలిజెన్స్ టీమ్‌తో గొడవ పడుతున్న వీడియోను సోషల్ మీడియాలో విజయ్ ప్రతాప్ పోస్ట్ చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పరాజయం పాలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. గుజరాత్, పంజాబ్‌లలో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు చోట్ల విజయబావుటా ఎగురవేసింది.
ఆప్ నాయకత్వంలో ఎంసీడీ పనితీరుతో తాము అసంతృప్తిగా ఉన్నట్టు కౌన్సిలర్ హిమాని జైన్ తెలిపారు. ఆ కారణంతోనో తాను, మరికొందరు కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి 'ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ' పేరుతో కొత్త పార్టీ ఏర్పాటుకు నిర్ణయించినట్టు చెప్పారు.
MLAs: రాజకీయాలంటే.. సంపాదనకే పరామావధి అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. కానీ ఎమ్మెల్యేగా ఎన్నికైనా కేవలం రూ . లక్ష సంపద కూడా లేని వారు దేశంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారి జాబితాను ఏడీఆర్ విడుదల చేసింది.
ఢిల్లీ ఆప్ అధ్యక్షుడిగా నియమితులైన సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, తమకు ఓటు వేసిన ప్రజల తరఫున, నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, గ్యాస్ సిలిండర్ హామీలతో బీజేపీకి ఓటు వేసిన ప్రజల తరఫున వారి హక్కులు కాపాండేందుకు తమ గళం వినిపిస్తామని చెప్పారు.
కేజ్రీవాల్, ఆప్ మాజీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్, మాజీ ద్వారక కౌన్సిలర్ నితిక శర్మ ఉద్దేశపూర్వకంగానే ప్రజా నిధులను దుర్వినియోగం చేస్తూ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో భారీ హోర్డింగ్‌లు పెట్టారని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.