AAP retains Tarn Tarn Bypoll: తరన్ తారన్ సీటును నిలబెట్టుకున్న ఆప్
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:34 PM
హర్మీత్ సింగ్ సంధుకు తరన్ తారన్‌లో ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయినప్పటికీ ఆయన 68,235 ఓట్లు దక్కించుకుని గెలుపును సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కరణ్‌బీర్ సింగ్ బుర్జ్ 22,473 ఓట్లు, సాద్ అభ్యర్థి సుఖ్వీందర్ కౌర్ 7,158 ఓట్లు, బీజేపీ అభ్యర్థి హర్జిత్ సింగ్ సంధు 3,042 ఓట్లు సాధించారు.
అమృత్‌సర్: పంజాబ్ (Punjab)లోని తరన్ తారన్ (Tarn Taran) అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆప్ ఆద్మీ పార్టీ (AAP) తమ ఆధిపత్యం నిలుపుకొంది. ఆ పార్టీ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు విజేతగా నిలిచారు. ఆప్ ఎమ్మెల్యే డాక్టర్ కశ్మీర్ సింగ్ సోహల్ మరణంతో ఈ సీటుకు ఉపఎన్నిక జరిగింది. నవంబర్ 11న జరిగిన ఎన్నికలో 60.95 శాతం పోలింగ్ నమోదైంది.
హర్మీత్ సింగ్ సంధుకు తరన్ తారన్‌లో ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయినప్పటికీ ఆయన 68,235 ఓట్లు దక్కించుకుని గెలుపును సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కరణ్‌బీర్ సింగ్ బుర్జ్ 22,473 ఓట్లు, సాద్ అభ్యర్థి సుఖ్వీందర్ కౌర్ 7,158 ఓట్లు, బీజేపీ అభ్యర్థి హర్జిత్ సింగ్ సంధు 3,042 ఓట్లు సాధించారు.
సున్నిత ప్రాంతం కావడంతో సరిహద్దు ప్రాంతాల్లో అదనపు బలగాలను దింపి భారీ భద్రత మధ్య శుక్రవారం ఉదయం కౌంటింగ్ నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం ఏడు టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 16 రౌండ్ల కౌంటింగ్ అనంతరం ఫలితాలు ప్రకటించారు. ఆప్ విజయంతో పంజాబ్‌లో గత ఏడు ఉప ఎన్నికల్లో ఆప్ 5 గెలుచుకున్నట్టయింది. కీలకమైన సరిహద్దు పాంతాల్లో పట్టుసాధిస్తామని ఆశించిన విపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్, సాద్‌కు తాజా ఎన్నికల ఫలితాలు నిరాశను మిగిల్చినట్టు చెబుతున్నారు. పంజాబ్ తదుపరి అసెంబ్లీ ఎన్నికలు 2027లో జరుగనున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఎన్డీయే విజయోత్సాహం.. పార్టీ ప్రధానకార్యాలయానికి మోదీ
బిహార్‌లో గెలుపు మాదే.. ఇక బెంగాల్‌లోనూ..: కేంద్ర మంత్రి
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.