Rahul Gandhi's 95 defeats: రాహుల్ @95 ఓటములు.. ఆయనకే అవార్డ్.!
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:35 PM
బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ప్రతిపక్ష మహాగట్బంధన్ కూటమి ఓటమి వైపు పయనిస్తోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష కూటమిలో ఒకరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు భాజపా నేతలు. ఈ నేపథ్యంలో ఓ భాజపా నేత చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Election updates) ఎన్డీయే కూటమి 200కు పైగా స్థానాల్లో ఆధిక్యంతో భారీ విజయం వైపు దూసుకెళ్తోంది(NDA). ప్రతిపక్ష మహాగట్బంధన్ కూటమి(MGB) ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై భారతీయ జనతా పార్టీ(BJP) నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. గత రెండు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 95 సార్లు ఓటమి చవిచూసినట్టు సూచించే ఓ మ్యాప్‌ను భాజపా నేత అమిత్ మాలవీయ(BJP leader Amit Malviya) 'X' వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓటముల్లో ఆయనకే అవార్డ్.!
కాంగ్రెస్ పార్టీలో 2004 నుంచి రాహుల్ గాంధీ కీలక స్థానాల్లో ఉన్నారు. నాటి నుంచి 2025 వరకు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్.. అనేక సార్లు విఫలమైందని, బిహార్‌లో మరో పరాభావం ఎదురుకానుందని మాలవీయ అన్నారు. తాజా ఓటమితో ఆయన 95 సార్లు ఓడిన రికార్డును నెలకొల్పనున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఓటముల్లో స్థిరత్వానికి అవార్డులేవైనా ఉంటే.. అవి రాహుల్‌కే దక్కేవని వ్యంగాస్త్రాలు సంధించారు. రాహుల్ పరాజయాలను చూసి ఓటమి కూడా ఆశ్చర్యపోతుందని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి:
ఆపేదెవరు.. బీహార్‌లో నితీశ్ ఏకఛత్రాధిపత్యం..
అమిత్ షా చెప్పింది నిజమే.. బీహార్‌లో ఎన్డీయే కూటమి ఆధిక్యం 180 ప్లస్..