Share News

Anmol Gagan Maan: రాజీనామాను వెనక్కి తీసుకున్న ఎమ్మెల్యే

ABN , Publish Date - Jul 20 , 2025 | 07:27 PM

పంజాబ్ గాయనిగా పేరుతెచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన 35 ఏళ్ల మాన్ 2022లో ఖరార్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మంత్రిగా కీలక శాఖల్లో పనిచేశారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కలేదు. అనూహ్యంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు శనివారం నాడు ప్రకటించారు.

Anmol Gagan Maan: రాజీనామాను వెనక్కి తీసుకున్న ఎమ్మెల్యే
Anmol gagan maan

అమృత్‌సర్: పంజాబ్‌లోని ఖరార్ నియోజకవర్గం ఆప్ ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ (Anmol Gagan Mann) రాజీనామాను ఆ పార్టీ అధిష్ఠానం తిరస్కరించింది. పార్టీలోనే మాన్ కొనసాగుతారని తెలిపింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాన్ ప్రకటించడంతో ఆమె రాజీనామాపై తలెత్తిన ఉత్కంఠకు తెరపడింది.


పంజాబ్ గాయనిగా పేరుతెచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన 35 ఏళ్ల మాన్ 2022లో ఖరార్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మంత్రిగా కీలక శాఖల్లో పనిచేశారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కలేదు. అనూహ్యంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు శనివారం నాడు ప్రకటించారు. రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్టు చెప్పారు. బరువెక్కిన హృదయంతో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని, తన రాజీనామాను స్పీకర్‌కు పంపానని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా ఆప్ ప్రభుత్వం పాలన అందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


కాగా, మాన్ రాజీనామా విషయం తెలియగానే ఆప్ పంజాబ్ అధ్యక్షుడు అమాన్ అరోరా నేరుగా ఆమెను కలుసుకున్నారు. ఆమె రాజీనామాను ఆమోదించడం లేదని, పార్టీలోనే కొనసాగాలని కోరారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండేందుకు మాన్ అంగీకరించారని, ఆమె పార్టీలోనే కొనసాగుతారని సమావేశానంతరం మీడియాకు అరోరా తెలిపారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి తన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మాన్ చెప్పారు.


ఇవి కూడా చదవండి..

తప్పుడు ప్రచారం తగదు.. పాశ్చాత్య మీడియాకు కేంద్ర మంత్రి చురకలు

ఇంట్లో ఉన్న వాళ్ల గురించి ప్రస్తావనెందుకు? కస్సుమన్న సిద్ధరామయ్య

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 20 , 2025 | 07:45 PM