Share News

Punjab: అధికార పార్టీ ఎమ్మెల్యే రాజీనామా.. రాజకీయాలకూ గుడ్‌బై

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:10 PM

బరువెక్కిన హృదయంతో రాజకీయాలను విడిచిపెట్టాలని నిర్ణయించున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మాన్ తెలిపారు. తన రాజీనామాను స్పీకర్ ఆమోదించాలని కోరారు. పార్టీకి బెస్ట్ విషెస్ తెలిపారు.

Punjab: అధికార పార్టీ ఎమ్మెల్యే రాజీనామా.. రాజకీయాలకూ గుడ్‌బై
Anmol Gagan Maan

ఛండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఖరార్ నియోజకవర్గం ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ (Anmol Gagan Maan) అదివారంనాడు తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సాంధ్వాన్‌ను తన రాజీనామా లేఖను సమర్పించినట్టు చెప్పారు.


బరువెక్కిన హృదయంతో రాజకీయాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మాన్ తెలిపారు. తన రాజీనామాను స్పీకర్ ఆమోదించాలని కోరారు. పార్టీకి బెస్ట్ విషెస్ తెలిపారు. పంజాబ్ ప్రజల అంచనాలకు తగినట్టుగా పాలన అందిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.


మాన్ 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖరార్ నియోజకవర్గం నుంచి గెలిచారు. భగవంత్ మాన్ మంత్రివర్గంలో కీలక శాఖలు నిర్వహించారు. పర్యాటకం, సాంస్కృతిక శాఖ, పెట్టుబడుల ప్రోత్సాహకం, లేబర్ అండ్ హాస్పిటాలిటీ శాఖలు నిర్వహించారు. గత ఏడాది మంత్రివర్గ విస్తరణలో ఆమెకు మంత్రి వర్గంలో చోటుదక్కలేదు. రాజకీయాల్లోకి రాకముందు పంజాబీ సింగర్‌గా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు.


ఇవి కూడా చదవండి..

ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మౌనం వీడాలి

వందే భారత్‌ రైళ్ల బుకింగ్‌లో కొత్త సదుపాయం.. అదేంటంటే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 04:12 PM