-
-
Home » Mukhyaamshalu » Andhra Pradesh Telangana National and International ABN Andhra Jyothy Live Updates of 25th March 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Mar 25 , 2026 | 06:01 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Mar 25, 2026 21:18 IST
సంగారెడ్డి: నటుడు రాజ్‌తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య హల్‌చల్
మల్లేపల్లి దగ్గర మద్యంమత్తులో కారుతో బైక్‌ను ఢీకొన్న లావణ్య
పరారీకి యత్నిస్తుండగా కారును అడ్డుకున్న మల్లేపల్లి గ్రామస్తులు
కారులో లావణ్యతోపాటు మరో వ్యక్తి
లావణ్యను పోలీసులకు అప్పగించిన మల్లేపల్లి వాసులు
లావణ్యపై కేసు నమోదు, కొండాపూర్ పీఎస్‌కు కారు తరలింపు
-
Mar 25, 2026 21:02 IST
టెర్రర్ లింకుల కేసులో కీలక పరిణామం
పలు రాష్ట్రాల్లో మరో ఏడుగురు నిందితులు అరెస్ట్
బిహార్, బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీలో అరెస్ట్
ఏడుగురిని ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ తీసుకువస్తున్న ప్రత్యేక బృందాలు
-
Mar 25, 2026 20:13 IST
అమరావతి: జగన్ జీవితం జంగిల్ బుక్ లాంటిది: మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి
జగన్ మాట్లాడేవన్నీ అబద్ధాలే
వైసీపీ పాలనలో జరిగిందంతా అరాచకమే
అసెంబ్లీకి వచ్చి జగన్ మాట్లాడాలి
-
Mar 25, 2026 20:12 IST
కర్నూలు: ఓర్వకల్ జైరాజ్ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం
ఫ్యాక్టరీలో దట్టంగా అలముకున్న పొగ
ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదన్న ప్లాంట్ యాజమాన్యం
-
Mar 25, 2026 17:44 IST
దేశంలో తగినంత ఇంధన నిల్వలు: కేంద్రం
రిఫైనరీలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి: కేంద్రం
అందుబాటులో 26 కోట్ల టన్నుల చమురు: కేంద్రం
LPG సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు: కేంద్రం
92%పైగా ఆన్‌లైన్ బుకింగ్స్ జరుగుతున్నాయి: కేంద్రం
దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు: కేంద్రం
-
Mar 25, 2026 17:42 IST
నా వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు: బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి
తమాషా చేస్తున్నారా అంటూ నన్ను బెదిరిస్తారా?
నేనేం తప్పు మాట్లాడానో రికార్డులు పరిశీలించండి
అవసరమైతే హౌస్ కమిటీ వేయండి
క్షమాపణ చెప్పాల్సి వస్తే చెబుతా
మాజీ ప్రధాని ఇందిర అంటే మాకు ఎప్పుడూ గౌరవమే
-
Mar 25, 2026 17:42 IST
నేను ఇందిరాగాంధీని అవమానించలేదు: బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి
ఇందిరాగాంధీ ఉక్కు మహిళ.. ప్రపంచస్థాయి నేత
కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు ఇందిరమ్మ పేరు పెడుతుంటారు
ఇప్పసారా పథకానికి గొప్ప మహిళానేత ఇందిర పేరు పెట్టొద్దన్నాను
గౌరవంతో సూచించా గానీ అవమానించాలని కాదు: రాకేష్‌రెడ్డి
-
Mar 25, 2026 17:41 IST
మహిళలకు బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా?: మంత్రి శ్రీధర్‌బాబు
రాకేష్‌రెడ్డి నోరు జారారు.. క్షమాపణ చెప్పాల్సిందే: శ్రీధర్‌బాబు
-
Mar 25, 2026 17:41 IST
ఇందిరాగాంధీపై అంత కక్ష ఎందుకు?: మంత్రి సీతక్క
మహిళా నేతను కించపరిచారు
రాకేష్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి
సంక్షేమ పథకాలకు మాత్రమే ఇందిరమ్మ పేరు
సంక్షోభం తెచ్చేవాటికి కాదు: మంత్రి సీతక్క
-
Mar 25, 2026 17:40 IST
బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఆగ్రహం
సారాపై మాట్లాడుతూ ఇందిరమ్మ పేరు తీయడంపై ఆగ్రహం
రాకేష్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్
-
Mar 25, 2026 17:40 IST
ఇప్పసారా అంశంపై తెలంగాణ అసెంబ్లీలో రభస
ఇప్పసారాపై తన వెర్షన్ వినిపించిన అనిరుధ్‌రెడ్డి
అనిరుధ్ ప్రసంగంపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి సెటైర్లు
ఇప్పసారా అంటే ప్రభుత్వానికి నవ్వులాటగా ఉంది: రాకేష్‌రెడ్డి
ఇప్పసారా తయారుచేస్తే ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టొద్దు: రాకేష్‌రెడ్డి
-
Mar 25, 2026 16:36 IST
తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్
పౌల్ట్రీ కంపెనీల విధానంపై చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆగ్రహం
పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవడంలేదని వ్యాపారుల ఆవేదన
చికెన్ రేట్లు పెరుగుతున్నా తమకిచ్చే మార్జిన్ పెరగడంలేదని నిరసన
-
Mar 25, 2026 16:10 IST
కడప: వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు: షర్మిల
నా జోలికి వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలుసు: షర్మిల
కుక్కలు అని నేను అనలేదు: షర్మిల
విజయమ్మ లేఖ రాసినా.. మాట్లాడుతుంటే.. మొరగడం కుక్కల నైజం అన్నాను: షర్మిల
-
Mar 25, 2026 15:57 IST
2026 ఫైనాన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
32 ప్రతిపాదిత సవరణలతో బిల్లు పాస్
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక నిబంధనలు
పన్నుల విధానం, కార్పొరేట్ పన్నుల్లో కీలక మార్పులు
-
Mar 25, 2026 15:40 IST
ఖమ్మం: పండ్రేగుపల్లి మాజీ సర్పంచ్ కిడ్నాప్ కథ సుఖాంతం
మాజీ సర్పంచ్ శిల్వరాజ్‌ను హైదరాబాద్‌లో వదిలేసిన కిడ్నాపర్లు
శిల్వరాజ్‌ను ముదిగొండ తీసుకొస్తున్న పోలీసులు
-
Mar 25, 2026 15:40 IST
కాంగ్రెస్ వచ్చాక 16 నోటిఫికేషన్లే ఇచ్చారు: హరీష్‌రావు
మేమిచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది
2 లక్షల ఉద్యోగాలని చెప్పి 16 వేలే ఇచ్చారు
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసింది
అసెంబ్లీ సమావేశాలు మరో వారం పొడిగించాలి
-
Mar 25, 2026 15:38 IST
భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
1,205 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
394 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
Mar 25, 2026 15:35 IST
23 మంది అభ్యర్థులతో అన్నాడీఎంకే తొలి జాబితా
ఎడప్పాడి నియోజకవర్గం నుంచి పళనిస్వామి పోటీ
ఏప్రిల్ 23న ఒకే విడతలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
Mar 25, 2026 15:29 IST
బీఆర్ఎస్‌తో ఎలాంటి పొత్తులు ఉండవు: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
పొత్తులపై రాంచందర్‌రావు వ్యాఖ్యలను సమర్థించిన ఏలేటి
-
Mar 25, 2026 15:14 IST
తెలంగాణలో ఇంధన కొరత లేదు: మంత్రి ఉత్తమ్
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: ఉత్తమ్
సోషల్ మీడియాలో వదంతులను నమ్మొద్దు: ఉత్తమ్
బంకుల దగ్గర ప్రజలు అనవసరంగా క్యూ కట్టొద్దు: ఉత్తమ్
డ్రమ్ములు, కంటైనర్లలో నింపితే కఠినచర్యలు: ఉత్తమ్
-
Mar 25, 2026 14:46 IST
హైదరాబాద్: సీఎం రేవంత్‌కు హరీష్ రావు కౌంటర్
తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం కాడు
రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవటం ఖాయం
ఎప్పుడు గోల్ కొట్టాలో మాకు బాగా తెలుసు
వాళ్ళు వీళ్ళు ఎందుకు? సిద్దిపేటలో నాపై పోటీకి రేవంత్ రెడ్డి రావాలి
-
Mar 25, 2026 14:43 IST
అడవి సంరక్షణకు కీలక అడుగు
స్థానికుల పునరావాసానికి ప్రభుత్వం చర్యలు
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో స్వచ్ఛంద పునరావాసానికి శంకుస్థాపన
అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి వర్చువల్‌గా పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి
-
Mar 25, 2026 14:41 IST
అమరావతి: జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ రాజీనామాకు ఆమోదం
ఇటీవలే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు బొలిశెట్టి ప్రకటన
బొలిశెట్టి సత్యనారాయణ చేపట్టే కార్యక్రమాలకు, పార్టీకి సంబంధం లేదని ప్రకటన
-
Mar 25, 2026 14:04 IST
హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
సోషల్ మీడియాలో వదంతులను నమ్మొద్దు: సీపీ సజ్జనార్
పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు..
అవసరం లేకుండా పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టొద్దు: సీపీ సజ్జనార్
-
Mar 25, 2026 13:37 IST
హైదరాబాద్: జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
కౌకూర్ భరత్‌నగర్‌లో తల్లి అంజును చంపి ఇంట్లో పాతిపెట్టిన కూతురు
సంవత్సరం కిందట జరిగిన ఘటన
గతంలో మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు
వాహనం అమ్మే క్రమంలో బయటపడిన హత్య ఘటన
-
Mar 25, 2026 13:01 IST
అమరావతి: మార్చి 28న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం
అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయనున్న ప్రభుత్వం
తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్న ఏపీ ప్రభుత్వం..
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం
-
Mar 25, 2026 12:58 IST
జగిత్యాల: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన టి.జీవన్ రెడ్డి
మల్లికార్జున్ ఖర్గేకు రాజీనామా లేఖ పంపిన టి.జీవన్ రెడ్డి
కాంగ్రెస్ కండువా తీసి, రైతు కండువా వేసుకున్న టి.జీవన్ రెడ్డి
-
Mar 25, 2026 12:57 IST
నంద్యాల : తేనెటీగల దాడి.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
శ్రీశైలం డ్యామ్ వద్ద ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరాస్వామి(52) మృతి
డ్యామ్ వద్ద విధుల్లో ఉండగా వీరాస్వామిపై తేనెటీగల దాడి
తేనెటీగల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్
తప్పించుకునే క్రమంలో గుండెపోటుకు గురై మరణించిన వీరాస్వామి
-
Mar 25, 2026 12:30 IST
కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ల దాడి
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ల దాడి
ప్రాణ నష్టం జరగలేదని కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ధ్రువీకరణ
-
Mar 25, 2026 12:22 IST
తెలంగాణ అసెంబ్లీలో ముగిసిన ప్రశ్నోత్తరాలు
పద్దులపై చర్చ ప్రారంభం..
కమర్షియల్ టాక్స్ పద్దును సభలో ప్రవేశపెట్టిన మంత్రి జూపల్లి కృష్ణారావు
-
Mar 25, 2026 11:45 IST
ఇంధన కొరత లేదు: కేంద్ర మంత్రి బండి సంజయ్
ఆయిల్ సంస్థల దగ్గర సరిపడా పెట్రోలు, డీజిల్ నిల్వలున్నాయి
పెట్రోలు, డీజిల్ సరఫరా నిరాటంకంగా కొనసాగుతోంది: బండి సంజయ్
-
Mar 25, 2026 11:34 IST
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అమెరికా ముందడుగు
ఇరాన్‌కు 15 ప్రతిపాదనలతో కాల్పుల విరమణ ప్రణాళికను పంపిన ట్రంప్ ప్రభుత్వం
పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు మీడియా కథనాల ద్వారా వెల్లడి
ఈ దౌత్యపరమైన ప్రయత్నాలతో ఇజ్రాయెల్ విస్మయానికి గురైనట్టు సమాచారం
-
Mar 25, 2026 11:31 IST
టీమిండియా కంటే ఐపీఎల్‌కు జట్టును తయారుచేయడమే కష్టం: గంగూలీ
ఆఖరి నిమిషంలో ఐపీఎల్‌కు దూరమవుతున్న విదేశీ ప్లేయర్లు
మిచెల్ స్టార్క్ ఆడటంపై స్పందించిన టీమిండియా దిగ్గజం గంగూలీ
నాణ్యమైన క్రికెటర్లు పాల్గొనకపోతే జట్టు సమతూకం దెబ్బతింటుంది: దాదా
-
Mar 25, 2026 11:20 IST
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు నోటీసులు
ఢిల్లీలోని ల్యుటియన్స్ జోన్ ఖాళీ చేయాలని కాంగ్రెస్‌కి నోటీసులు
అక్బర్ రోడ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ఎగ్జిట్ నోటీసు
తొలగింపును అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించనున్న కాంగ్రెస్
-
Mar 25, 2026 11:19 IST
20 నెలలుగా మానసిక వేదనకు గురయ్యా: టి.జీవన్‌రెడ్డి
అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా: టి.జీవన్‌రెడ్డి
మెజార్టీ ఉన్నా ఫిరాయింపులు చేయడం సరికాదు..
రాహుల్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు: టి.జీవన్‌రెడ్డి
-
Mar 25, 2026 11:11 IST
కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలన నిర్ణయం
ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన కేకేఆర్ లెజెండరీ ఆండ్రీ రస్సెల్
తన జెర్సీ నంబర్ 12కు కూడా రిటైర్‌మెంట్ ప్రకటిస్తూ కేకేఆర్ నిర్ణయం
ఐపీఎల్ చరిత్రలోనే ఈ నిర్ణయం తీసుకున్న తొలి ఫ్రాంచైజీగా నిలిచిన కేకేఆర్
-
Mar 25, 2026 10:50 IST
గుంటూరుకు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరు
నూతన దంపతులను ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్
-
Mar 25, 2026 10:36 IST
ఉక్రెయిన్‌పై రష్యా వెయ్యి డ్రోన్లతో దాడి
ఉక్రెయిన్‌లోని 550కి పైగా ప్రాంతాల్లో డ్రోన్ల దాడి
541 డ్రోన్లను కూల్చేశాం: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
డ్రోన్ల దాడిలో ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
-
Mar 25, 2026 10:22 IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
63 మందితో ఛత్తీస్‌గఢ్ జగదల్పూర్ బయలుదేరిన విమానం
జగదల్పూర్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో వెనుదిరిగిన వైనం
తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన విమానం
-
Mar 25, 2026 10:09 IST
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 1065, నిఫ్టీ 343 పాయింట్లకు పైగా లాభం
డాలర్‌తో పోలిస్తే 93.81కి చేరిన రూపాయి విలువ
-
Mar 25, 2026 10:08 IST
తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన
తెలంగాణలో ఇంధన కొరత లేదు: డీలర్స్ అసోసియేషన్
HPCL, BPCL, IOCL కంపెనీల దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి
-
Mar 25, 2026 10:04 IST
ప్రారంభమైన తెలంగాణ శాసనసభ సమావేశాలు
సభలో మొదలైన ప్రశ్నోత్తరాలు
-
Mar 25, 2026 09:38 IST
నేడు గుంటూరుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు..
గుంటూరు రానున్న సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి హజరుకానున్న సీఎంలు
-
Mar 25, 2026 08:03 IST
విజయవాడ: ఉగ్ర లింకుల కేసులో మరొకరు అరెస్టు
హైదరాబాద్‌కు చెందిన సయీదా బేగం అరెస్టు
సయీదా బేగంను అరెస్ట్ చేసిన కౌంటర్ ఇంటెలిజెన్స్
సయీదా బేగంను విచారిస్తున్న పోలీసులు
-
Mar 25, 2026 08:02 IST
యుద్ధంలో ఇరాన్‌తో గెలిచాం: డొనాల్డ్ ట్రంప్
సైనిక పరంగా ఇరాన్ చచ్చిపోయింది: ట్రంప్
అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ ఆసక్తిగా ఉంది
ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
-
Mar 25, 2026 07:46 IST
ఢిల్లీ: సోనియా గాంధీకి అస్వస్థత
గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోనియా గాంధీ
సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
-
Mar 25, 2026 07:35 IST
నేడు శ్రీశైలం దేవస్థానం బోర్డు సమావేశం
పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
-
Mar 25, 2026 07:34 IST
చిత్తూరు: కుప్పంలో కొనసాగుతున్న నారా భువనేశ్వరి పర్యటన
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న నారా భువనేశ్వరి
-
Mar 25, 2026 07:34 IST
నంద్యాల: హైవేపై ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం
టైరు పేలిపోవడంతో పొలాల్లోకి దూసుకెళ్లిన మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు
ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు గాయాలు
ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు
-
Mar 25, 2026 07:32 IST
కర్నూలు: చెన్నమ్మ సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం
బైకును ఢీకొన్న లారీ.. ఒకరి మృతి.
ఘటనా స్థలంలో స్థానికులపైకి దూసుకెళ్లిన మరో లారీ.. ఇద్దరి మృతి
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Mar 25, 2026 07:24 IST
పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారుల భారీ క్యూ
తెలుగు రాష్ట్రాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు
పెట్రోల్, డీజిల్ దొరకడం లేదంటూ వదంతులు
వదంతులు నమ్మొద్దంటున్న అధికారులు
ఇంధన సరఫరా కొనసాగుతోందని క్లారిటీ
-
Mar 25, 2026 06:59 IST
ఆరో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఇప్ప పువ్వు సారా విధానంపై నేడు సభలో మాట్లాడనున్న MLA అనిరుధ్‌రెడ్డి
ట్రోల్ చేసేవాళ్లు తన స్పీచ్ వినాలన్న అనిరుధ్‌రెడ్డి
-
Mar 25, 2026 06:58 IST
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రెండో రోజు కస్టడీ
రోహిత్‌రెడ్డి, రితేష్, నమిత్‌ను విచారించనున్న సిట్
శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విచారణ
-
Mar 25, 2026 06:07 IST
పశ్చిమాసియా సంక్షోభంపై నేడు అఖిలపక్ష సమావేశం
ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం
రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన అన్ని పార్టీలతో చర్చించనున్న కేంద్రం
సమావేశంలో పాల్గొననున్న విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్
-
Mar 25, 2026 06:05 IST
RCBని కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్
యునైటెడ్ స్పిరిట్స్ నుంచి RCBని కొనుగోలు చేసిన ఏబీజీ, టీవోఐ
రూ.16,706 కోట్లకు RCBని కొనుగోలు చేసిన ఏబీజీ, టీవోఐ
-
Mar 25, 2026 06:03 IST
జగిత్యాల: నేడు కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి రాజీనామా
ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్న జీవన్‌రెడ్డి
సమావేశంలోనే రాజీనామా ప్రకటన చేయనున్న జీవన్‌రెడ్డి
-
Mar 25, 2026 06:01 IST
నేడు కేంద్ర కేబినెట్ భేటీ
ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర కేబినెట్ భేటీ
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం
చట్టసభల్లో మహిళలకు 33% కోటా కల్పించే దిశగా కేంద్రం అడుగులు
పార్లమెంట్‌లో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం వ్యూహరచన