కలల ప్రపంచంలో విజయ్ విహారం
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:36 PM
టీవీకే నేత విజయ్‌కు రాష్ట్ర ప్రజల గురించి తమిళ సంస్కృతి, రాజకీయాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా కలల ప్రపంచంలో విహరిస్తున్నారని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ విమర్శించారు.
కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ ధ్వజం
చెన్నై: టీవీకే నేత విజయ్‌కు రాష్ట్ర ప్రజల గురించి తమిళ సంస్కృతి, రాజకీయాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా కలల ప్రపంచంలో విహరిస్తున్నారని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసే నిమిత్తం ఆయన మంగళవారం నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన లేని విజయ్‌కి అభిమానులుండవచ్చని, ఆ అభిమానం ఓట్లుగా మారే అవకాశం లేదన్నారు.
గతంలో ఎంతోమంది సినీ కళాకారులు రాజకీయాల్లోకి వచ్చారని, వారిలో చాలామందిని తమిళ ప్రజలు తిరస్కరించారని చెప్పారు. తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మాజీ ముఖ్యమంత్రి జయమ్మ పరిపాలన మళ్ళీ రావాలని ఆకాంక్షిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయిన డీఎంకే ప్రభుత్వాన్ని ఎన్డీయే తరిమికొట్టడం ఖాయమన్నారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే ఎన్డీయే ప్రభుత్వం మహిళలు, రైతుల కోసం పాటుపడుతుందన్నారు.
కాగా టి.నగర్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డీఎంకే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ‘నేరస్థుడి బోనులో స్టాలిన్ సర్కార్’ పేరుతో ముద్రించిన పుస్తకాన్ని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ తదితరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, ఆ పార్టీ కొ-ఇన్‌చార్జ్ డాక్టర్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు తమిళిసై, అన్నామలై తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రైలు ప్రయాణికులకు షాక్.. రీఫండ్ నియమాల్లో మార్పులు..
బీజాపూర్‌లో 25 మంది మావోయిస్టుల లొంగుబాటు
Read Latest Telangana News and National News