Share News

మోదీకి కట్టు బానిస ఎడప్పాడి

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:13 PM

ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్రంలో పెత్తనంచెలాయిస్తున్న బీజేపీ మంత్రులకు అన్నాడీఎంకే నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి కట్టుబానిసలా వ్యవహరిస్తున్నారని ఉపముఖ్యమంత్రి ఉదయనిధి ఎద్దేవా చేశారు.

మోదీకి కట్టు బానిస ఎడప్పాడి

చెన్నై: ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్రంలో పెత్తనంచెలాయిస్తున్న బీజేపీ మంత్రులకు అన్నాడీఎంకే నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి కట్టుబానిసలా వ్యవహరిస్తున్నారని ఉపముఖ్యమంత్రి ఉదయనిధి ఎద్దేవా చేశారు. మంగళవారం ఉదయం తిరువణ్ణామలైలో పోటీ చేస్తున్న మంత్రి ఈవీ వేలుకు మద్దతుగా ఆయన ఓట్ల వేట సాగించారు. ఆ సందర్భంగా తిరువణ్ణామలై నగరం తిరువళ్లువర్‌ విగ్రహం కూడలి వద్ద రోడ్‌షో జరిపారు. ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో విద్య, వైద్యరంగాలు బాగా అభివృద్ధి చెందాయని,


వైద్యం కోసం రాష్ట్రానికి వచ్చే విదేశీయులు ఎక్కువగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని, విద్యలోనూ రాష్ట్ర రాణించడానికి సీఎం స్టాలిన్‌ ప్రవేశపెట్టిన నాన్‌ ముదల్వన్‌ పధకం, పుదుమైపెణ్‌ వంటి పధకాలే కారణమని చెప్పారు. మహిళలకు సిటీ, టౌన్‌ బస్సులలో వెలుగుబాట పయ నం పధకం, గృహిణులకు కలైంజర్‌ మహిళా సాధికారిక పథకం వంటి పథకాల అమలు వల్ల ఆర్థిక ప్రగతి ద్విసంఖ్యలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా డీఎంకే ప్రభుత్వాన్ని ప్రశంసించిందన్నారు.


nani2.2.jpgబడిపిల్లల అల్పాహార పథకంకు మంచి స్పందన లభించడంతో ఆ పథకాన్ని ఎనిమిదో తరగతి వరకూ విస్తరించనున్నట్లు మేనిఫెస్టోలో ప్రకటించామని చెప్పారు. ఐదేళ్లలో 30లక్షల మంది విద్యార్థులకు ఉచిత లాప్‌టా్‌పలు పంపిణీ చేయనున్నామని, కలైంజర్‌ డ్రీమ్‌ హౌస్‌ పథకం ద్వారా 10లక్షల గృహాలను నిర్మించనున్నామని ఆయన తెలిపారు. ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి కేంద్రంలోని పాలకులకు బానిసలా ప్రవర్తిస్తున్నారని, పదే పదే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులను కలుసుకుని వారి ఆదేశాలను పాటిస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఎప్పుడూ ఢిల్లీలోని బీజేపీ పాలకులకు వ్యతిరేకంగా ఎన్నికలలో తీర్పు వెలువరిస్తుందని ఆయన అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రైలు ప్రయాణికులకు షాక్.. రీఫండ్ నియమాల్లో మార్పులు..

బీజాపూర్‌లో 25 మంది మావోయిస్టుల లొంగుబాటు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 01 , 2026 | 12:13 PM