చాన్నాళ్లుగా ఐపీఎల్‌కు దూరం.. ఈసారైనా మయాంక్ యాదవ్ ఆడుతాడా?
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:55 AM
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ సీజన్లో అయినా స్టార్ పేసర్ మయాంక్ యాదవ్ ఆడుతాడా? లేదా? అనే సందేహాలు ఏర్పడుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: మయాంక్ యాదవ్.. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరఫున అద్భుత ప్రదర్శనలు చేసి గాయాల కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా నేడు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ సీజన్లో అయినా స్టార్ పేసర్ మయాంక్ యాదవ్ ఆడుతాడా? లేదా? అనే సందేహాలు ఏర్పడుతున్నాయి. గాయాల నుంచి కోలుకుని ఐపీఎల్లో అయితే అడుగుపెట్టాడు కానీ.. నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడా? అనే దానిపై స్పష్టత లేదు. అయితే ఈ విషయంపై లఖ్‌నవూ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు.
‘మయాంక్ యాదవ్‌తో పాటు మరో పేసర్ నమన్ తివారీ మంచి ఫిట్నెస్తో ఉన్నారు. మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారిద్దరూ మంచి భవిష్యత్తు ఉన్న ప్లేయర్లు. ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా ఈసారి లీగ్‌లో మేం ఇద్దరు అద్భుతమైన యువ పేసర్లతో బరిలోకి దిగుతున్నాం. ఇప్పటికే మోసిన్ ఖాన్, షమీ, ఆకాశ్ సింగ్ ఉన్నారు. ఆన్రిచ్ నోకియా సేవలను మిస్ అవుతున్నాం. అయితే అర్జున్ టెండూల్కర్ వంటి మరో యువ ఆల్‌రౌండర్ జట్టులో ఉన్నాడు. తుది జట్టులో ఎవరికి అవకాశం కల్పిస్తామనేది ఇప్పుడే చెప్పలేం. మ్యాచ్‌కు ముందు నిర్ణయం తీసుకుంటాం’ అని లాంగర్ తెలిపాడు.
మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాం: చమీర
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఢిల్లీ బౌలర్ దుష్మంత చమీర వెల్లడించాడు. ‘గత కొన్ని రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నాం. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడాం. ఎప్పుడెప్పుడు ప్రధాన మ్యాచ్ ఆడుతామా? అని ఎదురుచూస్తున్నాం. గత మూడు మ్యాచుల్లోనూ హోం టీమ్‌లే గెలిచిన సందర్బాలను చూశాం. లఖ్‌నవూ నుంచి గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నా. బౌలింగ్ యూనిట్ అంతా చర్చించుకుని పక్కా ప్రణాళికతో బరిలోకి దిగబోతున్నాం. మా ఓపెనర్లు మార్క్రమ్, మిచెల్ మార్ష్ మంచి ఫామ్‌లో ఉన్నారు’ అని చమీర వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
రిటైర్మెంట్ దిశగా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి.. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతాడా?
ఇప్పుడు బానే ఉన్నా.. తన గాయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్!