ఇప్పుడు బానే ఉన్నా.. తన గాయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్!
ABN , Publish Date - Apr 01 , 2026 | 10:15 AM
న్యూ చండీగఢ్ వేదికగా వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ సందర్బంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డ విషయం తెలిసిందే. తాజాగా తన గాయంపై శ్రేయస్ కీలక అప్‌డేట్ ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. న్యూ చండీగఢ్ వేదికగా వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ కూపర్ కనోలీ ఒంటిరి పోరాటం చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే మ్యాచ్ సందర్బంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డ విషయం తెలిసిందే. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అయ్యర్ మణికట్టుకు తీవ్ర గాయమైంది. తాజాగా తన గాయంపై శ్రేయస్ కీలక అప్‌డేట్ ఇచ్చాడు.
‘నా చేతికి స్పల్ప గాయమైంది. పెద్దది అవ్వొద్దని గట్టిగా కోరుకున్నా. ప్రస్తుతం అంతా బాగుంది. గాయం తీవ్రత కూడా పెద్దగా లేదు. అయితే ఈ మ్యాచ్‌లో హీరో మాత్రం కూపర్ కనోలీనే. అద్భుతమైన టెక్నిక్‌తో మ్యాచ్ ఆడాడు. కనోలీ బాదిన కొన్ని షాట్స్ మాత్రం అద్భుతం. డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి చేతి గాయానికి ఐస్ పెట్టుకునే లోపే టపాటపా వికెట్లు పడిపోయాయి. క్రికెట్‌లో ఇలాంటి పరిస్థితులు సహజం. ఏం జరిగినా పోరాటం ఆపొద్దు. కనోలీ అదే చేశాడు. ప్రశాంతంగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించాడు’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.
గిల్ కెప్టెన్సీ బాగుంది..
‘అర్ష్‌దీప్ సింగ్ వచ్చి బంతి కాస్త ఆగి వస్తోందని చెప్పాడు. అందుకే మేం బంతిని వీలైనంత త్వరగా పాతబడేలా చేయడానికి ప్రయత్నించాం. విజయ్ కుమార్ వైశాఖ్ గత సీజన్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడు బిగ్ మ్యాచ్ ప్లేయర్. అయితే నేను బ్యాటింగ్ చేసే సమయంలో షార్ట్ లెగ్ ఫీల్డర్‌ను చూసి షాకయ్యాను. ఇంతకుముందు ఏ కెప్టెన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నేను చూడలేదు. ఈ విషయాన్ని గిల్‌తో కూడా చెప్పాను. శుభ్‌మన్ గిల్ ఇలాంటి అటాకింగ్ ఫీల్డింగ్ సెట్ చేయడం బాగుంది’ అని శ్రేయస్ అయ్యర్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ కొత్త హీరో.. అసలు ఎవరీ కూపర్ కనోలీ!
ఫిఫా ప్రపంచ కప్: వరుసగా మూడోసారి.. ప్లే ఆఫ్స్ నుంచే నిష్క్రమించిన ఇటలీ