Share News

ఇంట్లో కూడా ఇలానే వండుతారా?

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:15 AM

‘మీ ఇంట్లో ఇలానే భోజనం వండుతారా? మరీ ఇంత అధ్వాన్నంగా పిల్లలకు అన్నం పెడితే ఎలా... మెనూ పాటించడం లేదు.

ఇంట్లో కూడా ఇలానే వండుతారా?

  • ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆగ్రహం

  • మధ్యాహ్న భోజన ఏజెన్సీపై డీఈవోకు ఫిర్యాదు

కళ్యాణదుర్గం(అనంతపురం): ‘మీ ఇంట్లో ఇలానే భోజనం వండుతారా? మరీ ఇంత అధ్వాన్నంగా పిల్లలకు అన్నం పెడితే ఎలా... మెనూ పాటించడం లేదు. గుడ్డులో నాణ్యత లేదు’ అంటూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు.. మధ్యాహ్న భోజన ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంబదూరు మండలంలోని రాళ్లఅనంతపురం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని మంగళవారం ఎమ్మెల్యే తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నాసిరకం భోజనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


mla2,2.jpgఏజెన్సీ నిర్వాహకులపై మండిపడ్డారు. హెచ్‌ఎం పర్యవేక్షణ ఏమైందని ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీపై తక్షణం చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఫోన్‌లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సొంత నిధులతో 80 మంది విద్యార్థులకు యోగా మ్యాట్లను పంపిణీ చేశారు. సొంత నిధులతో పాఠశాలలో మరుగుదొడ్లు, ఫ్లోరింగ్‌, వంట గది నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

చిత్తూరులో అదృశ్యమైన మహిళ దారుణ హత్య

కోనసీమలో కుమ్ముడు నిజమే!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 01 , 2026 | 11:27 AM