Home » Udayanidhi Stalin
రాష్ట్రంలో మతచిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీలను, నేతలను అడ్డుకుంటామని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. నగరంలో శుక్రవారం జరిగిన బూత్‌కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బాధ్యతాయుతమైన 12వేల మందితో కూడిన యువజన విభాగం డీఎంకే సైన్యంగా ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) పేర్కొన్నారు..
ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి తన తాత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిలాగే చురుకైన నేత అని, జ్ఞాపకశక్తి కూడా అధికమని సీనియర్ మంత్రి దురైమురుగన్ ప్రశంసించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారంనాడు ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల స్టేట్ రన్ లిక్కర్ కార్పొరేషన్ 'టాస్మాక్ ' కార్యాలయంపై ఈడీ దాడులు జరిపిన నేపథ్యంలో స్టాలిన్ ఢిల్లీ పర్యటన చేపట్టారని విపక్ష అన్నాడీఎంకే ఆరోపించింది.
కలైంజర్ లైబ్రరీకి రండి.. అంటూ విద్యార్థులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి కోరారు. ఈ లైబ్రరీలో అన్ని రకాల పుస్తకాలు అందుబాలో ఉన్నాయని, విద్యార్థుు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
సనాతన ధర్మం గురించి మాట్లాడుతూనే ఉంటా... అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాట పెద్ద వివాదమే ఏర్పడింది. ఉదయనిధిపై కేసుల నమోదు వరకు వెళ్లింది. కాగా... ఆ కేసు విచారణ ఆగస్టుకు వాయిదా పడింది.
సివిల్స్ విజేతలకు రాష్ట్ర ప్రభుత్వ నజరానా ప్రకటించింది. ఈమేరకు.. యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఢిల్లీ వెళ్లేందుకు రవాణా ఖర్చులకు తలా రూ.50వేలు అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి తెలిపారు.
దివ్యాంగులను ప్రోత్సాహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి అన్నారు. ఆయన మాట్లాడుతూ..దివ్యాంగ క్రీడాకారులు వంద మందికి 3 శాతం రిజర్వేషన్ కింద ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించామని తెలిపారు.
తమిళనాడు అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే నవ్వులు పూయించారు. ఉదయనిధి మంత్రివర్గంలోనూ దురైమురుగన్‌కు చోటు ఉంటుందంటూ ఎమ్మెల్యే పన్నీర్‌సెల్వం చేసిన వ్యాఖ్యలతో సభలో అందరూ నవ్వుకోవడం జరిగింది.
తమిళనాడుకు రాష్ట్ర హోదా కోసం ప్రజాస్వామ్య యుద్ధభూమిలో డీఎంకే ప్రభుత్వం దృఢంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న వారు రాష్ట్ర అధికారాలను చేజిక్కించుకుంటున్న సమయంలో, తమిళనాడు తన గొంతు బలంగా వినిపిస్తూనే ఉంటుందన్నారు.