Share News

Senior Minister Duraimurugan: మీ తాతగారిలా మీది కంప్యూటర్‌ మైండ్‌..

ABN , Publish Date - Jul 04 , 2025 | 10:47 AM

ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి తన తాత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిలాగే చురుకైన నేత అని, జ్ఞాపకశక్తి కూడా అధికమని సీనియర్‌ మంత్రి దురైమురుగన్‌ ప్రశంసించారు.

Senior Minister Duraimurugan: మీ తాతగారిలా మీది కంప్యూటర్‌ మైండ్‌..

- ఉదయనిధిపై దురైమురుగన్‌ ప్రశంసల వర్షం

చెన్నై: ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి తన తాత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిలాగే చురుకైన నేత అని, జ్ఞాపకశక్తి కూడా అధికమని సీనియర్‌ మంత్రి దురైమురుగన్‌(Senior Minister Duraimurugan) ప్రశంసించారు. వేలూరు జిల్లా కాట్పాడి(Katpadi)లో జరిగిన పార్టీ నాయకుడి ఇంటి వివాహ వేడుకల్లో ఇద్దరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఉదయనిధి ప్రసంగిస్తూ.. తన రాజకీయ జీవితానికి పునాది వేసింది కాట్పాడి ప్రాంతమేనని,


డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ జన్మించిన భూమి ఇదేనని, అంతటి కీర్తిగడించిన కాట్పాడిలో జరిగిన వివాహవేడుకకు హాజరుకావడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పుడు మొదట ఆశీర్వదించింది దురైమురుగన్‌ అని, అప్పటిదాకా శాసనసభలో వెనుకవరుసలో కూర్చున్న తాను ఆయన పక్కనే కూర్చున్నానని తెలిపారు.


nani1.2.jpg

దురైమురుగన్‌ సలహాలను కూడా పాటిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత దురైమురుగన్‌ మాట్లాడుతూ ఉదయనిధిని ప్రశంసలవర్షంలో ముంచెత్తారు. కాట్పాడిలో తన కుమారుడు కదిర్‌ ఆనంద్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రచారం చేసినట్లు ఉదయనిధి గుర్తు చేశారని,


ఆ విషయం తాను పూర్తిగా మరచిపోయానన్నారు.అయితే ఆయన మరచిపోకుండా ఆ పాత సంగతులను గుర్తు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఉదయనిధి పార్టీపై పట్టుకలిగి ఉండటానికి ఆయన జ్ఞాపకశక్తే కారణమని, పార్టీలో అందరిని గుర్తుంచుకుని కలుగోపుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

కాటేదాన్‌ రబ్బర్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం

రిజర్వేషన్లు అమలు తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 04 , 2025 | 10:47 AM