Dy CM Udayanidhi Stalin: డీఎంకే సైన్యంగా యువజన విభాగం..
ABN , Publish Date - Jul 05 , 2025 | 11:58 AM
బాధ్యతాయుతమైన 12వేల మందితో కూడిన యువజన విభాగం డీఎంకే సైన్యంగా ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) పేర్కొన్నారు..

- ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి
చెన్నై: బాధ్యతాయుతమైన 12వేల మందితో కూడిన యువజన విభాగం డీఎంకే సైన్యంగా ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) పేర్కొన్నారు.. డీఎంకే(DMK) యువజన విభాగం కార్యదర్శిగా ఆరు వసంతాలు పూర్తిచేస్తున్న ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...
యువజన విభాగం కార్యదర్శిగా ఏడో ఏట అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి జిల్లాలో బలమైన నిర్మాణంతో యువజన విభాగం, అట్టడుగుస్థాయి నుంచి ఆవిర్భంచిందని, తమిళ సమాజం పురోగతి కోసం యువజన విభాగం తరఫున మేము పనిచేస్తున్నామని ఉదయనిధి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విశాఖ వందేభారత్‌కు ఇకపై 20 బోగీలు
నిరుద్యోగుల కష్టాలు కనబడట్లేదా...
Read Latest Telangana News and National News