Chennai News: డీఎంకే జెండాకు 75 యేళ్లు..
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:38 AM
నలుపు, ఎరుపు రంగులు కలిగిన డీఎంకే పతాకం రూపొందించి 75 యేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం వళ్లువర్‌కోట్టం లో రెండు రోజుల సదస్సు నిర్వహించనున్నారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి.
చెన్నై: నలుపు, ఎరుపు రంగులు కలిగిన డీఎంకే పతాకం రూపొందించి 75 యేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం వళ్లువర్‌కోట్టం లో రెండు రోజుల సదస్సు నిర్వహించనున్నారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) శనివారం ఈ వేడుకలను ప్రారంభిస్తారు. అలాగే ‘కాలత్తిన్ నిరమ్ కరుప్పు శివప్పు’ అనే గ్రంథాన్ని ఆవిష్కరించనున్నారు.
ఆ తర్వాత సదస్సు, పుస్తక ప్రదర్శన కూడా ప్రారంభిస్తారు. గత 75 యేళ్లలో రాష్ట్రంలో, వివిధ వర్గాల్లో, సమాజంలో డీఎంకే తీసుకొచ్చిన మార్పులకు సంబంధించిన అంశాలు ‘కాలత్తిన్ నిరమ్ కరుప్పు శివప్పు’ అనే గ్రంథంలో ఉన్నాయని సదస్సు నిర్వాహకులు తెలిపారు. ఈ గ్రంథాన్ని స్టాలిన్ ఆవిష్కరించి తొలి ప్రతిని సీనియర్ మంత్రి దురైమురుగన్‌కు అందజేస్తారు. ‘ఇరువణ్ణ కొడిక్కు వయదు 75’ పేరుతో శనివారం ఐదు సదస్సులు, ఆదివారం ఐదు సదస్సులు చొప్పున మొత్తం 10 సదస్సులు జరుగనున్నాయి. ఆదివారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ప్రసంగంతో ఈ వేడుకలు ముగియనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కిసాన్ డ్రోన్.. సాగు ఖర్చు డౌన్
Read Latest Telangana News and National News