Dy CM Udayanidhi: డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్.. రాష్ట్రంలో కాషాయానికి నో ఎంట్రీ
ABN , Publish Date - Jul 26 , 2025 | 10:40 AM
రాష్ట్రంలో మతచిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీలను, నేతలను అడ్డుకుంటామని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. నగరంలో శుక్రవారం జరిగిన బూత్‌కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

డిప్యూటీ సీఎం ఉదయనిధి
చెన్నై: రాష్ట్రంలో మతచిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీలను, నేతలను అడ్డుకుంటామని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) పేర్కొన్నారు. నగరంలో శుక్రవారం జరిగిన బూత్‌కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రధాన ప్రతిపక్షాలన్నీ బూత్‌కమిటీలను ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్పారు.
డీఎంకేకు సంబంధించినంతవరకూ దశబ్దాల తరబడి బూత్‌కమిటీలు సమర్థవంతంగా పనిచేయగలుగుతున్నాయని ఆయన కితాబిచ్చారు. ఇటీవల తిరువణ్ణామలైలో జరిగిన పార్టీ సమావేశంలో ఎన్నికల బరిలో డీఎంకే అన్ని పార్టీలకంటే ముందుగా దూసుకెళ్లుతోందని చెప్పానని, ఆ ప్రకారమే నాలుగేళ్ల డీఎంకే పాలనలో అమలు చేసిన పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, వారి అండదండలు డీఎంకే కూటమికే లభిస్తాయనే విశ్వాసం తనకుందన్నారు.
రాష్ట్రంలోకి అడ్డదారుల్లో అక్రమంగా ప్రవేశించి మత చిచ్చురగిల్చాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీకి, ఆ పార్టీ నేతలకు అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతుండటం సిగ్గుచేటైన విషయమని ఎద్దేవా చేశారు. పునర్విభజన పేరుతో రాష్ట్రంలో ఎంపీల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీతో ఈపీఎస్ చేతులు కలుపటం భావ్యమేనా అని ఆలోచించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకూఏటమి చిత్తుగా ఓడిపోవటం ఖాయమన్నారు. ఈ సభలో మంత్రి పీకే శేఖర్‌బాబు, ఎంపీ దయానిధి మారన్, మేయర్ ఆర్.ప్రియ, శాసనసభ్యులు తాయగం కవి, పరంధామన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
యాదగిరిగుట్ట సత్యదేవుడి వ్రత టికెట్ ధర పెంపు
Read Latest Telangana News and National News