జాతకంలో ఈ రెండు గ్రహాలు బలంగా ఉంటే డబ్బుకు కొరత ఉండదు!
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:24 PM
మీరు ఎంత కష్టపడినా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా? దీనికి కారణం జాతకంలో గురు, శుక్ర గ్రహాల బలం తగ్గడమే అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు గ్రహాలు బలంగా ఉంటే డబ్బుకు కొరత ఉండదు!
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరూ జీవితంలో ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటారు. కానీ కొన్ని సార్లు ఎంత కష్టపడినా డబ్బు నిలవదు. దీనికి కారణం జాతకంలో గురు, శుక్ర గ్రహాల బలహీనత కావచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
జ్యోతిష్యశాస్త్రంలో గురు గ్రహాన్ని (బృహస్పతి) జ్ఞానం, సంపద, అదృష్టం, ఆధ్యాత్మికతకు కారకుడిగా భావిస్తారు. జాతకంలో గురువు బలంగా ఉంటే వ్యక్తికి విద్యా, ధనం, గౌరవం, సంతానం, సంతోషం లభిస్తాయని నమ్ముతారు. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే అన్ని సౌకర్యాలు కలుగుతాయి. విలాసవంతమైన జీవితం, సంతోషకరమైన వైవాహిక జీవితం కలుగుతాయి.
గ్రహాలు బలహీనంగా ఉంటే కనిపించే లక్షణాలు:
ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం.
అనుకోని ఖర్చులు పెరగడం.
పెట్టుబడుల్లో నష్టాలు రావడం.
ఉద్యోగం లేదా వ్యాపారంలో అస్థిరత.
ఆర్థిక పురోగతికి సులభ పరిహారాలు:
లక్ష్మీదేవి కృప కోసం కనకధారా స్తోత్రం చదవడం మంచిది. ఇది ధనలాభానికి దోహదం చేస్తుంది.
వాస్తు ప్రకారం ఉత్తరానికి అధిపతి కుభేరుడు అని అంటారు. ఈ దిశను ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం, ఉత్తర వైపున డబ్బు పెట్టడం మంచిది.
రోజూ పక్షులకు ధాన్యాలు పెట్టడం వల్ల రాహు, కేతు దోషాలు తగ్గి ఆర్థికంగా లాభం కలుగుతుందని నమ్మకం.
గురు గ్రహం కోసం:
పసుపు రంగు దుస్తులు ధరించాలి.
అరటి చెట్టుకు పూజ చేయాలి.
పేదలకు శనగ పప్పు, కందిపప్పు దానం చేయాలి.
శుక్ర గ్రహం కోసం:
తెల్లని దుస్తులు ధరించాలి.
లక్ష్మీదేవిని పూజించి తెల్లని పూలు సమర్పించాలి.
బియ్యం, పాలు లేదా మిఠాయిలు దానం చేయాలి.
ఈ సులభమైన జ్యోతిష్య పరిహారాలను పాటిస్తే, ఆర్థిక సమస్యలు తగ్గి సంపద పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు
For More Lifestyle