Share News

లోక్‌సభ ముందుకు అమరావతి బిల్లు.. చర్చ ప్రారంభం

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:09 PM

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్‌సభలో కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టింది. ఏపీ పునర్విభజన చట్టం పేరుతో బిల్లును సభలో ప్రవేశపెట్టారు.

లోక్‌సభ ముందుకు అమరావతి బిల్లు.. చర్చ ప్రారంభం
Amaravati bill

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్‌సభలో కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టింది. ఏపీ పునర్విభజన చట్టం పేరుతో బిల్లును కేంద్రహోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ సభలో ప్రవేశపెట్టారు. ఆపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Loksabha Speaker Om Birla) అనుమతితో చర్చ ప్రారంభమైంది. అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది. చర్చలో కాంగ్రెస్ తరఫున ఎంపీ మాణిక్కం ఠాకూర్ పాల్గొన్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ పేర్కొంది.


బిల్లుకు మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం ఠాకూర్‌ ప్రకటించారు. అమరావతి కేవలం రాజధాని కాదని.. కోట్లాది మంది ప్రజల ఆక్షాంక్ష అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉందన్నారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌ సాక్షిగా నాటి ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం ఇవ్వాలన్నారు. ఏపీకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని ఎంపీ మాణిక్కం ఠాకూర్‌ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

చిత్తూరులో అదృశ్యమైన మహిళ దారుణ హత్య

అమరావతి చట్టబద్ధత బిల్లు.. లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన టీడీపీ ఎంపీలు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 01 , 2026 | 12:39 PM