అమరావతి ఇక అజేయం.. అజరామరం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:24 PM
అమరావతి చట్టబద్ధత బిల్లుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతామని అన్నారు.
అమరావతి, ఏప్రిల్ 1: లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) స్పందించారు. అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధతకు తెరపడిందన్నారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఒక కీలక మైలురాయని సోషల్ మీడియా ఎక్స్‌లో సీఎం పోస్ట్ చేశారు.
చంద్రబాబు ట్వీట్...
ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని సీఎం అన్నారు. ఈరోజు లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయి, అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందని సీఎం పేర్కొన్నారు. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం ఇదన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఓ కీలక మైలురాయన్నారు. అమరావతి ఇక అజేయం.. అజరామరం అని అన్నారు సీఎం. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతామని స్పష్టం చేశారు. సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. లోక్‌సభలో బిల్లుకు మద్దతు పలికిన అన్ని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత
మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్
Read Latest AP News And Telugu News