Huge Scam: స్టాక్ మార్కెట్ పేరుతో ఘరానా మోసం..150 కోట్లతో పరార్
ABN, Publish Date - May 30 , 2025 | 09:52 PM
భాగ్యనగరంలో ఘరానా మోసం జరిగింది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ఓ ముఠా చేసిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రూ.150 కోట్ల వరకు నిందితులు మోసం చేశారు. జీడిమెట్ల ఠాణా పరిధిలోని చింతల్ గణేష్ నగర్‌లో ది పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో ఓ సంస్థను కేటుగాళ్లు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: భాగ్యనగరంలో ఘరానా మోసం జరిగింది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ఓ ముఠా చేసిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రూ.150 కోట్ల వరకు నిందితులు మోసం చేశారు. జీడిమెట్ల ఠాణా పరిధిలోని చింతల్ గణేష్ నగర్‌లో ది పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో ఓ సంస్థను కేటుగాళ్లు ఏర్పాటు చేశారు. కొంతమంది ఈ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టారు.
పెంగ్విన్ సంస్థలో ఒక్కొక్కరు లక్ష నుంచి కోటి రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. గత కొన్ని రోజులుగా బాధితులకు డబ్బులు చెల్లించకుండా పెంగ్విన్ సంస్థ నిర్వాహకులు తప్పించుకొని తిరుగుతున్నారు. బాధితులు పెంగ్విన్ సంస్థ నిర్వాహకులను నిలదీయడంతో చేతులెత్తేశారు. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఒకరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కరీంనగర్ నుంచి కుట్రలు.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు
అన్నింటినీ భరించుకుంటూ వచ్చా.. సిన్సియర్‌గా పనిచేశా.. అయినప్పటికీ
Read Latest Telangana News And Telugu News
Updated at - May 30 , 2025 | 09:59 PM