Adulterated Ice Cream: భీమవరంలో కల్తీ ఐస్‌క్రీమ్..

ABN, Publish Date - Nov 25 , 2025 | 08:51 PM

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కల్తీ ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్న ఓ కంపెనీపై విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఐస్‌క్రీమ్‌లో కలిపే కాలం చెల్లిన ఫుడ్ ఫ్లేవర్స్‌ను అధికారులు గుర్తించారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కల్తీ ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్న ఓ కంపెనీపై విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఐస్‌క్రీమ్‌లో కలిపే కాలం చెల్లిన ఫుడ్ ఫ్లేవర్స్‌ను అధికారులు గుర్తించారు. కాలం చెల్లిన రసాయనాలు, ఫుడ్ ఫ్లేవర్స్‌తో నిర్వాహకులు ఐస్ క్రీమ్‌లను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఐస్‌క్రీమ్ శాంపిల్స్‌ను సేకరించిన అధికారులు.. ల్యాబ్‌‌కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా కేసులు నమోదు చేస్తామని చెబుతున్నారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Nov 25 , 2025 | 08:51 PM