CM Issue: ఢిల్లీకి చేరిన సీఎం పంచాయితీ
ABN , Publish Date - Jul 10 , 2025 | 09:04 PM
కర్నాటకలో సీఎంగా ఐదేళ్ల పాటు తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. కర్నాటకలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగాహానాలను కొట్టిపారేశారు..

కర్నాటకలో సీఎంగా ఐదేళ్ల పాటు తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. కర్నాటకలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగాహానాలను కొట్టిపారేశారు. ప్రస్తుతానికి కర్నాటక సీఎం కుర్చీ ఖాళీ లేదన్నారు. డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసం తనను కాంగ్రెస్ హైకమాండ్ రాజీనామా చేయమన్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని చెప్పారు. నాయకత్వం రొటేషన్‌పై పార్టీ హైకమాండ్ టైంలైన్ లేదా సూచనలు ఏవీ చేయలేదని సిద్ధరామయ్య వెల్లడించారు. తాను రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ కోరారని, అయితే ఇప్పటివరకూ దానిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదని ఆయన తెలిపారు.