Pahalgam Terror Attack: ఉగ్రదాడికి నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీ
ABN , Publish Date - Apr 25 , 2025 | 09:09 PM
జమ్మూకాశ్వీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకూ ప్రదర్శన చేశారు.

జమ్మూకాశ్వీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకూ ప్రదర్శన చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి, ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, భారత్ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొని పహల్గామ్ మృతులకు సంతాపం తెలియజేశారు.