Share News

Train tickets: రైలు ప్రయాణికులకు సువర్ణవకాశం.. టికెట్లకు యూటీఎస్‌ యాప్‌..

ABN , Publish Date - Feb 28 , 2025 | 10:24 AM

ఊరెళ్లేందుకు రైల్వే స్టేషన్‌(Railway station)కు వెళ్తున్నారా, బుకింగ్‌ కౌంటర్‌ వద్ద రద్దీని చూసి భయపడుతున్నారా, మీకేం భయంలేదు, రైల్వే అధికారులు సువర్ణ అవకాశం కల్పించారు. అన్‌రిజర్వ్‌డ్‌ టికెటింగ్‌ సిస్టం(యూటీఎస్‌) యాప్‌ ద్వారా టికెట్లు తీసుకుంటే 3 శాతం క్యాష్‌ బ్యాక్‌ వంటి సేవలు కల్పించింది దక్షిణ మధ్య రైల్వే.

Train tickets:  రైలు ప్రయాణికులకు సువర్ణవకాశం.. టికెట్లకు యూటీఎస్‌ యాప్‌..

- 3 శాతం క్యాష్‌ బ్యాక్‌ పొందండి

- రైలు ప్రయాణికులకు సువర్ణవకాశం

సికింద్రాబాద్‌: ఊరెళ్లేందుకు రైల్వే స్టేషన్‌(Railway station)కు వెళ్తున్నారా, బుకింగ్‌ కౌంటర్‌ వద్ద రద్దీని చూసి భయపడుతున్నారా, మీకేం భయంలేదు, రైల్వే అధికారులు సువర్ణ అవకాశం కల్పించారు. అన్‌రిజర్వ్‌డ్‌ టికెటింగ్‌ సిస్టం(యూటీఎస్‌) యాప్‌ ద్వారా టికెట్లు తీసుకుంటే 3 శాతం క్యాష్‌ బ్యాక్‌ వంటి సేవలు కల్పించింది దక్షిణ మధ్య రైల్వే(South Central Railway). వినియోగదారుడికి అనుకూలమైన డిజిటల్‌ పద్దతులను ప్రవేశపెట్టడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఊరెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు రావడం బుకింగ్‌ కౌంటర్‌ వద్ద రద్దీ ఉండడం చూసిన కొందరు ఏటీవీఎం (ఆటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మిషిన్‌)లను ఆశ్రయిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP MLA: చొరబాటుదారులను గుర్తించేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలి


2016లో మొదలైన యూటీఎస్‌ సిస్టమ్‌

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు 2016లో హైదరాబాద్‌ జంట నగరాల్లో 26 సబర్బన్‌ స్టేషన్‌లలో జోన్‌ వారీగా యూటీఎస్‌ మొబైల్‌ ఆప్లికేషన్‌ను ప్రశేపెట్టింది. 2018 జూలైలో రైల్వేలోని అన్ని స్టేషన్లను యూటీఎస్‌ కవర్‌ చేస్తూ ప్లాట్‌ ఫాం ప్రయాణ టికెట్లు బుకింగ్‌ కోసం అన్ని నాన్‌-సబర్బన్‌ స్టేషన్లకు ఈ సౌకర్యం విస్తరించబడింది. ఆధునిక టికెట్‌ వ్యవస్థలో యూటీఎస్‌ యాప్‌ ప్రయాణికులకు సులువుగా మారింది. రైల్వేలో రిజర్వ్‌ చేయని టికెట్లపై ప్రయాణించే వారికి ఇదోక వరమని చెప్పవచ్చు.


డిజిటల్‌ ఇండియా విధానానికి అనుగునంగా ఈ యాప్‌ నగదు రహిత లావాదేవీలను అనుమతిస్తుంది. అదే విధంగా ప్రయాణికులకు సులువుగా ఉండేందుకు ఆర్‌-వాలెట్‌, పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, లేదంటే ఇంటర్నెంట్‌ బ్యాకింగ్‌ వంటి డిజిటల్‌ మోడ్‌ల ద్వారా చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. ప్రయాణికులకు ఇష్టం ఉంటే రూ. 20 వేల వరకు డిపాజిట్‌ చేసుకునే విధంగా సౌకర్యాల్ని కల్పించారు. ఆర్‌ వాలెట్‌ ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకునే ప్రయాణికులకు రైల్వే యంత్రాంగం 3 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఇస్తున్నారు.


పెరుగుతున్న ఆన్‌లైన్‌ సేవలు

ఆన్‌లైన్‌ టికెట్ల కొనుగోలు విషయంలో రోజు రోజుకు విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. యూటీఎస్‌ యాప్‌ ద్వారా 2023-24లో ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు ఒక రోజులో 83.510 మంది ప్రయాణికులు సేవలు వినియోగించుకున్నారు. 2024-25 ఏడాదిలో ప్రతి రోజుకు 93,487 ప్రయాణికులు ఆన్‌లైన్‌ సేవలు వినియోగించుకున్న క్రమంలో 12 శాతం పెరిగిందని రైల్వే అధికారులు ప్రకటించారు.


యూటీఎస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి

స్మార్ట్‌ఫోన్‌ ఉన్న వారు దాదాపు రైలు ప్రయాణం కోసం ఇంటి నుంచే ఆన్‌లైన్‌ సేవలు వినియోగించుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌(Smartphone)లో యూటీఎస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునిటికెట్‌ కొనుకుని సులువుగా రైలు ప్రయాణం చేయవచ్చు. లేదంటే ప్రయాణికులు నేరుగా బుకింగ్‌ కౌంటర్‌ వద్దకు వచ్చి కౌంటర్ల వద్ద యూటీఎస్‌ క్యూ ఆర్‌ కోడ్‌ను వినియోగించుకోవచ్చు.


ఈవార్తను కూడా చదవండి: ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన టన్నెల్‌

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..

ఈవార్తను కూడా చదవండి: అభివృద్ధి పనులు పెండింగ్‌ లేకుండా చూడాలి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 28 , 2025 | 10:24 AM