Share News

TGPSC: గ్రూప్‌-2 పరీక్ష ‘కీ’ విడుదల

ABN , Publish Date - Jan 18 , 2025 | 03:52 AM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) గత డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించిన గ్రూప్‌-2 రాత పరీక్ష ‘కీ’ని శుక్రవారం విడుదల చేసింది.

TGPSC: గ్రూప్‌-2 పరీక్ష ‘కీ’ విడుదల

  • ఈ నెల 22 వరకు అభ్యంతరాలకు అవకాశం

హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) గత డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించిన గ్రూప్‌-2 రాత పరీక్ష ‘కీ’ని శుక్రవారం విడుదల చేసింది. నాలుగు సెషన్లలో జరిగిన నాలుగు ప్రశ్నపత్రాల ప్రిలిమినరీ ‘కీ’తో పాటు మాస్టర్‌ ప్రశ్న పత్రాలను కమిషన్‌ వెబ్‌సైట్‌ (www.tspsc.gov.in)లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్‌ కార్యదర్శి ఇ.నవీన్‌ నికోలస్‌ ఓ ప్రకటన లో తెలిపారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే అభ్యర్థులు లాగిన్‌ అయి ఆంగ్లంలో సమర్పించాలని, అభ్యంతరాలతోపాటు వాటిని రుజువు చేసే ఆధారాలను కూడా సమర్పించాలని సూచించారు. ఈ నెల 18 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ‘కీ’పై అభ్యంతరాలను సమర్పించాలని తెలిపారు. ఈ-మెయిల్‌ లేదా వ్యక్తిగతంగా సమర్పించే విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.


ఇంటర్‌ ఫీజు గడువు 25 వరకు పొడిగింపు

వచ్చే మార్చిలో జరగనున్న ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షలకు రూ.2,500 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 25వ తేదీ వరకు ఇంటర్‌బోర్డు పొడిగించింది. కాగా, జాతీయ ప్రతిభా పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించినట్లు తెలంగాణ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. దరఖాస్తులను http.//scholarship.gov.inలో సమర్పించాలని సూచించింది.

Updated Date - Jan 18 , 2025 | 03:52 AM