Addanki Dayakar: బీజేపీ - బీఆర్‌ఎస్‌ల రాజకీయ డ్రామాలు
ABN , Publish Date - Mar 09 , 2025 | 03:22 AM
రాష్ట్రంలో బీజేపీ - బీఆర్‌ఎస్ పార్టీల రాజకీయ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు.

మోదీ దర్శకత్వంలో బీఆర్‌ఎస్: అద్దంకి దయాకర్
హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో బీజేపీ - బీఆర్‌ఎస్ పార్టీల రాజకీయ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు. ప్రజా సమస్యలపై అఖిలపక్షం పెట్టాలని బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు డిమాండ్ చేశాయని.. అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేస్తే బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు ఎందుకు హాజరుకాలేదని ఆయన ప్రశ్నించారు.
కేంద్రం నుంచి రావలసిన పెండింగ్ ప్రాజెక్టుల విషయమై ఎంపీల సమావేశం ఏర్పాటు చేస్తే బీజేపీ-బీఆర్‌ఎస్ ఎంపీలెవరూ హాజరుకాలేదని మండిపడ్డారు. మోదీ దర్శకత్వంలో నడిచే స్థాయికి బీఆర్‌ఎస్ దిగజారిపోయిందని విమర్శించారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా చర్చకు రావడంతో బీఆర్‌ఎ్‌సకు, బీజేపీకి మింగుడు పడటం లేదన్నారు.