CP CV Anand: సైబర్ నేరాల ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కోవాలి
ABN , Publish Date - Jan 29 , 2025 | 10:02 AM
పెరుగుతున్న సైబర్ నేరాల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వేగంగా స్పందించడం అవసరమని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్(City Police Commissioner CV Anand) అన్నారు. డిజిటల్ మోసాలు అంశంపై ఆర్‌బీఐ అధికారులు, పోలీసుల మధ్య ఉన్నత స్థాయి సమావేశం మంగళవారం జరగ్గా.. సీపీ సీవీ ఆనంద్ మాట్లాడారు.

- సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీ: పెరుగుతున్న సైబర్ నేరాల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వేగంగా స్పందించడం అవసరమని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్(City Police Commissioner CV Anand) అన్నారు. డిజిటల్ మోసాలు అంశంపై ఆర్‌బీఐ అధికారులు, పోలీసుల మధ్య ఉన్నత స్థాయి సమావేశం మంగళవారం జరగ్గా.. సీపీ సీవీ ఆనంద్ మాట్లాడారు. ప్రతి నెలలో బ్యాంకులు, లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ (ఎల్‌ఈఏ) మధ్య సమన్వయ వర్క్‌షాప్‌లు నిర్వహించాలని, వాటిలో ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్ చర్యలు, మోసాల తీరుతెన్నులపై అవగాహన, సమర్థవంతమైన సమన్వయంపై చర్చించాలని నిర్ణయించారు.
ఈ వార్తను కూడా చదవండి: Software jobs: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో మోసం..
కోర్టు రిఫండ్ ఆర్డర్లు, ఖాతాపై మల్టీపుల్ హోల్డ్స్ వంటి సమస్యలను పరిష్కరించేందుకు సమగ్ర ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్‌ఓపీ) రూపకల్పన కోసం కమిటీని ఏర్పాటు చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబర్ క్రైమ్స్) కవిత, భిక్షంరెడ్డి, హెచ్డీఎఫ్సీ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంకుల లీగల్ అడ్వైజర్స్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఆర్‌బీఐ ప్రాంతీయ డైరెక్టర్ కమల్ ప్రసాద్ పట్నాయక్, జనరల్ మేనేజర్ రుచి అస్థానా పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy : పిచ్చోడు.. తిక్కలోడు
ఈవార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
ఈవార్తను కూడా చదవండి: TG News: ఛీ ఛీ అనిపించుకోను
Read Latest Telangana News and National News