Trains: వేసవిలో 20 వీక్లీ స్పెషల్ రైళ్లు
ABN , Publish Date - Apr 19 , 2025 | 09:58 AM
ప్రస్తుత వేసవి సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాలకు వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. చర్లపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతోపాటు మరికొన్ని స్టేషన్ల నుంచి ఈ రైళ్లు బయలు దేరనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్: వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Cemtral Railway) శుక్రవారం ప్రకటించింది. వివిధ స్టేషన్ల నుంచి మొత్తం 20 ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్టు పేర్కొంది. ఏప్రిల్ 22నుంచి మే25 వరకు ప్రతి మంగళవారం చర్లపల్లి - డెహ్రాడూన్(Cherlapalli - Dehradun)కు (07077) ఆరు రైళ్లు, ఏప్రిల్ 24 నుంచి మే 29 వరకు (గురువారం) డెహ్రాడూన్ నుంచి చర్లపల్లికి(07078) ఆరు రైళ్లు, మే12 నుంచి జూన్ 2 వరకు (సోమవారం) బిలాస్పూర్ నుంచి కాచిగూడ(Bilaspur to Kacheguda)కు (08263) నాలుగు రైళ్లు, మే 13 నుంచి జూన్ 3 వరకు(మంగళ) కాచిగూడ నుంచి బిలాస్పూర్ వరకు నాలుగు రైళ్లు నడుపుతామని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: RTC buses: చర్లపల్లి నుంచి సికింద్రాబాద్‌కు పది నిమిషాలకో బస్సు
ఈ వార్తలు కూడా చదవండి
బస్తర్‌లో కాల్పుల విరమణ అత్యవసరం
ఆర్‌ఎస్‌ఎస్ తరహాలో.. ప్రజల్ని కలవండి
గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయండి
Read Latest Telangana News and National News