Share News

Special trains: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక వీక్లీ రైళ్లు

ABN , Publish Date - Jul 18 , 2025 | 07:05 AM

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 నుంచి ఆగస్టు 15 వరకు (ప్రతి శుక్రవారం) ఎర్నాకుళం- పాట్నా(06085) మార్గంలో నాలుగు రైళ్లు, ఈనెల 28నుంచి ఆగస్టు 18 వరకు(ప్రతి సోమవారం) పాట్నా-ఎర్నాకుళం (06086) మధ్యలో నాలుగు రైళ్లు నడుస్తాయని తెలిపారు.

Special trains: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్..  చర్లపల్లి నుంచి ప్రత్యేక వీక్లీ రైళ్లు

-చర్లపల్లి - తిరుపతి ప్రత్యేక వీక్లీ రైళ్లు

- వేర్వేరు ప్రాంతాలకు 16 వీక్లీ ప్రత్యేక రైళ్లు..

హైదరాబాద్‌ సిటీ: ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 నుంచి ఆగస్టు 15 వరకు (ప్రతి శుక్రవారం) ఎర్నాకుళం- పాట్నా(06085) మార్గంలో నాలుగు రైళ్లు, ఈనెల 28నుంచి ఆగస్టు 18 వరకు(ప్రతి సోమవారం) పాట్నా-ఎర్నాకుళం (06086) మధ్యలో నాలుగు రైళ్లు నడుస్తాయని తెలిపారు. ఆగస్టు 3 నుంచి 24వరకు (ప్రతి ఆదివారం) తిరుపతి - చర్లపల్లి(Tirupati - Cherlapally) (07481) మార్గంలో నాలుగు రైళ్లు, ఆగస్టు 4నుంచి 25వరకు (ప్రతి సోమవారం) చర్లపల్లి - తిరుపతి (07482) మార్గంలో నడుస్తాయని పేర్కొన్నారు.


city1.2.jpg

రైల్వే మ్యానుఫాక్చరింగ్‌ యూనిట్‌ పనులను పరిశీలించిన జీఎం

కాజీపేటలో నూతనంగా చేపట్టిన రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ నిర్మాణ పనులను దక్షిణమధ్య రైల్వే జనరల్‌మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ గురువారం పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్‌ నుండి కాజీపేట సెక్షన్‌ వరకు సంజయ్‌కుమార్‌ రైల్వే డివిజన్‌ మేనేజర్‌ భరతే్‌షకుమార్‌ జైన్‌తో కలిసి రియర్‌ విండో తనిఖీలు నిర్వహించారు.


city1.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి.

బీఆర్‌ఎస్‌ నా దారిలోకి రావాల్సిందే..

కాళ్లూచేతులూ కట్టేసి.. గొంతుకు వైరు బిగించి..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 18 , 2025 | 07:12 AM