Trains: మరో 16 ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..
ABN , Publish Date - Apr 22 , 2025 | 07:45 AM
వేసవి సెలవుల నేపధ్యంలో.. మరో 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మే, జూన్ నెలల్లో హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు. ఆ రైళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్ సిటీ: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని మే, జూన్ నెలల్లో హైదరాబాద్(Hyderabad) నుంచి వివిధ మార్గాల్లో 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. మే నెల 7 నుంచి 28 వరకు ప్రతి బుధవారం సికింద్రాబాద్ నుంచి రామేశ్వరం(Secunderabad to Rameshwaram) (07695), మే 9 నుంచి 30వరకు ప్రతి శుక్రవారం రామేశ్వరం నుంచి సికింద్రాబాద్‌కు (07696) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని సీపీఆర్‌ఓ శ్రీధర్(CPRO Sridhar) తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: ఒకటి కాదు.. రెండుకాదు.. మొత్తం రూ52.29 లక్షలు.. ఏం జరిగిందంటే..
అలాగే, మే 12 నుంచి జూన్ 2 వరకు ప్రతి సోమవారం కాచిగూడ నుంచి మధురై(Kacheguda to Madurai)(07191)కు, మే 14 నుంచి జూన్ 4 వరకు ప్రతీ బుధవారం రామేశ్వరం నుంచి కాచిగూడకు (07192) ప్రత్యేకరైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Price Record: బంగారం లకారం
గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు
కేటీఆర్‌పై కేసులు కొట్టివేసిన హైకోర్టు
ACB: ఏసీబీ వలలో ఐదుగురు అధికారులు
Read Latest Telangana News and National News