Train: నగరంలోని రాజస్థానీయులకో శుభవార్త..
ABN , Publish Date - Jul 19 , 2025 | 07:33 AM
నగరంలో స్థిరపడిన రాజస్థానీయుల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతుంది. రాజస్థాన్‌కు రైలు నడపాలన్న రాజస్థానీయుల విన్నపాన్ని రైల్వే శాఖ నెరవేర్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని భగత్‌కీకోటికి ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని నిర్ణయించింది.

- నేడు కాచిగూడ- భగత్‌కీకోటి రైలు ప్రారంభం
హైతరాబాద్: నగరంలో స్థిరపడిన రాజస్థానీయుల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతుంది. రాజస్థాన్‌కు రైలు నడపాలన్న రాజస్థానీయుల విన్నపాన్ని రైల్వే శాఖ నెరవేర్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్(Kacheguda Railway Station) నుంచి రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని భగత్‌కీకోటి(Bhagatkeikoti)కి ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని నిర్ణయించింది. శనివారం సాయంత్రం 5.30 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి భగత్‌కీకోటి ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణోవ్, జి. కిషన్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజీవ్‌కుమార్ శ్రీవాస్తవతో కలిసి ప్రారంభించనున్నారు.
ఈ రైలు (17605) ప్రతీ రోజూ రాత్రి 11.05 గంటలకు కాచిగూడ(Kacheguda) నుంచి బయలుదేరి నిజామాబాద్, ముద్కేడ్, నాందేడ్(Nizamabad, Mudgee, Nanded), పూర్ణ, ఆకోల, ఇటార్సీ, ఉజ్జయినీ, ఆజ్మీర్ మీదుగా భగత్‌కీకోటి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. 7 స్లీపర్, 7 థర్డ్ ఏసీ, 2 సెకండ్ ఏసీ, 4 జనరల్ బోగీలు, 1 లాగేజీ, 1 దివ్యాంగుల కంపార్ట్‌మెంట్ ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News