Share News

Minister Ponguleti: అందుకే వీఆర్వో వ్యవస్థ రద్దు చేశారు.. కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Apr 22 , 2025 | 02:41 PM

Minister Ponguleti Srinivasa Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చెప్పిన పనులు చేయలేదని అర్ధరాత్రి వీఆర్వో వ్యవస్థ రద్దు చేశారని ఆరోపించారు.

Minister Ponguleti: అందుకే వీఆర్వో వ్యవస్థ రద్దు చేశారు.. కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్
Minister Ponguleti Srinivasa Reddy

యాదాద్రి : ఏదైనా చట్టం చేస్తే అది ప్రజలకు ఉపయోగపడాలి కానీ భారం కావద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీఆర్ గొప్పతనం, స్వార్థం కోసం నలుగురు వ్యక్తులు నాలుగు గోడల మధ్య కూర్చుని చేసిన చట్టం ధరణి అని ఆరోపించారు. ఇవాళ(మంగళవారం) యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు.


ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ధరణి అమలు చేసే సమయంలో వంద రోజులు రిజిస్ట్రేషన్లు జరగలేదని అన్నారు. భూ భారతి చట్టం అందరి ఆమోదయగ్యంతో చేశామని చెప్పారు. మే ఒకటి తేదీ నుంచి 28 జిల్లాల్లో జిల్లాకొక్క మండలంలో పైలట్ ప్రాజక్టు అమలు చేస్తామని అన్నారు. కేసీఆర్ చెప్పిన పనులు చేయలేదని అర్ధరాత్రి వీఆర్వో వ్యవస్థ రద్దు చేశారని ఆరోపించారు. అధికారులు అధికార దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Inter Results: ఇంటర్ ఫలితాలు విడుదల..

YSRCP Leaders: దూకుడు పెంచిన కూటమి సర్కార్.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్

IPS officer Anjaneyulu: కాదంబరి జత్వాని కేసులో మరో ఐపీఎస్ అరెస్ట్

AP NEWS: ఎలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 22 , 2025 | 02:44 PM