Share News

Kavitha RTI Statement: ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

ABN , Publish Date - Jul 21 , 2025 | 10:39 AM

రేవంత్ సర్కారుపై మరోసారి ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ఈసారి సమాచార హక్కు చట్టంలో కమిషనర్ల నియామకాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సమాచార హక్కు చట్టం కమిషన్ నియామకాల్లో సామాజిక న్యాయం ఎక్కడుందని ఎక్స్ వేదికగా విమర్శించారు.

Kavitha RTI Statement: ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
MLC Kavitha RTI statement

ఇటీవల కాలంలో తెలంగాణ జాగృతి (Telangana Jagruti) తరపున ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కీలక పోరాటాలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు సొంతపార్టీ బీఆ‌ర్‌ఎస్ తీరుగా బహిరంగంగా ఎండగడుతున్నారు. తాజాగా ఎక్స్ వేదికగా సమాచార హక్కు చట్టం కమిషన్ (Right to Information Act Commission)లో కమిషనర్ల నియాకంలో ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ విమర్శల బాణం ఎక్కుపెట్టారు. సమాచార హక్కు చట్టం కమిషన్‌లో బీసీలు, ఎస్టీలకు చోటు ఇవ్వరా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.


ఎమ్మెల్సీ కవిత Xలో చేసిన పోస్టులో, 'సమాచార హక్కు చట్టం కమిషన్ లో బీసీలు, ఎస్టీలకు చోటు లేదా? ఇప్పటికే నియమించిన చీఫ్ కమిషనర్, నలుగురు కమిషనర్ లలో ఒక్కరు కూడా, ఎస్టీ, బీసీలు లేరు. మరో ముగ్గురు కమిషనర్ల నియామకాలకు రూపొందించిన ప్రతిపాదనల్లోనూ బీసీలు, ఎస్టీలకు ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. జనాభా దామాషా ప్రకారం పెండింగ్ లో ఉన్న మూడు కమిషనర్ పోస్టులను బీసీలు, ఎస్టీలతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ది ఉన్నదో ఈ చర్యలే రూడీ చేస్తున్నాయి.' అని ట్వీట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్‌

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 11:22 AM