Share News

Water Disputes: జల వివాదాల కమిటీకి అధికారుల పేర్లు పంపండి

ABN , Publish Date - Jul 21 , 2025 | 04:34 AM

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేయనున్న కమిటీలో తెలంగాణ తరఫున నియమించాల్సిన అధికారుల పేర్లను ప్రతిపాదించాలని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రాన్నికోరింది.

Water Disputes: జల వివాదాల కమిటీకి అధికారుల పేర్లు పంపండి

  • రాష్ట్రాన్ని కోరిన కేంద్ర జలశక్తి శాఖ

హైదరాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేయనున్న కమిటీలో తెలంగాణ తరఫున నియమించాల్సిన అధికారుల పేర్లను ప్రతిపాదించాలని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రాన్నికోరింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో గత బుధవారం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డిలు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిటీలో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న అధికారుల పేర్లను సూచించాలని తాజాగా కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర నీటిపారుదల శాఖకు లేఖ రా సింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఈ అంశంపై త్వరలో సమీక్ష నిర్వహించి అధికారుల పేర్లను ఎంపిక చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.


గంజాయి అమ్ముతూ దొరికిన హోంగార్డు

కంది, జూలై 20 (ఆంధ్రజ్యోతి): గంజాయిని అరికట్టవలసిన పోలీసులే యథేచ్ఛగా దానిని అమ్ముతున్నారు. సంగారెడ్డి కోర్టులో హోంగార్డుగా పనిచేస్తున్న కొమ్ముల రాజు (46) కంది పట్టణ శివారులోని ఓ హోటల్‌ వద్ద గంజాయి అమ్ముతూ శనివారం రాత్రి పోలీసులకు అడ్డంగా దొరికాడు. అతని వద్ద నుంచి 800 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సంగారెడ్డి రూరల్‌ ఎస్సై రవీందర్‌ తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి, ఆదివారం రిమాండ్‌కు తరలించామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్‌

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 04:35 AM