Share News

MLA Talasani: ఎమ్మెల్యే తలసాని సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

ABN , Publish Date - Jul 15 , 2025 | 08:39 AM

నిర్బంధాల నడుమ పండుగలు జరపడం సరికాదని సనత్‌నగర్‌ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. సోమవారం సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి ఆలయం వద్ద ఆయన పర్యటించారు. ఆదివారం బోనాల సందర్భంగా అమ్మవారి దర్శనం సమయంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను పలువురు భక్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

MLA Talasani: ఎమ్మెల్యే తలసాని సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

- నిర్బంధాల నడుమ పండుగలు సరికాదు..

సికింద్రాబాద్‌: నిర్బంధాల నడుమ పండుగలు జరపడం సరికాదని సనత్‌నగర్‌ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ (Sanathnagar MLA Talasani Srinivas Yadav)అన్నారు. సోమవారం సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి ఆలయం వద్ద ఆయన పర్యటించారు. ఆదివారం బోనాల సందర్భంగా అమ్మవారి దర్శనం సమయంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను పలువురు భక్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తలసాని మాట్లాడుతూ..


city4.2.jpg

నిర్బంధాల మధ్య పండుగలు, జాతరలను నిర్వహించడం వలన భక్తులు ఇబ్బందులకు గురవుతారని చెప్పారు. 2014 నుంచి భక్తులకు ఇబ్బందులు, అసౌకర్యానికి గురి కాకుండా, బోనాల ఉత్సవాలు ఘనంగా, సంతోషంగా జరుపుకునే విధంగా తాము ఏర్పాట్లు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్‌ అత్తెల్లి మల్లిఖార్జున్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు అత్తెల్లి శ్రీనివాస్ గౌడ్‌, శ్రీహరి, మహే్‌షయాదవ్‌, మహేందర్‌ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

యువతి మోజులో పడి భర్త వేధింపులు ఉరివేసుకొని భార్య ఆత్మహత్య

Read Latest Telangana News and National News

Updated Date - Jul 15 , 2025 | 08:39 AM