MLA: అధికారులపై ఎమ్మెల్యే ఫైర్.. పని చేస్తున్నారా.. టైంపాస్ కోసం వస్తున్నారా..
ABN , Publish Date - Jul 16 , 2025 | 10:31 AM
‘ప్రజా సమస్యలు పట్టించుకోరా.. అసలు మీరు పని చేస్తున్నారా.. లేక టైంపాస్ కోసం కార్యాలయానికి వస్తున్నారా?’ అంటూ బడంగ్‌పేట్ కార్పొరేషన్ అధికారుల పని తీరుపై మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

- బడంగ్‌పేట్ అధికారులపై ఎమ్మెల్యే సబిత ఆగ్రహం
హైదరాబాద్: ‘ప్రజా సమస్యలు పట్టించుకోరా.. అసలు మీరు పని చేస్తున్నారా.. లేక టైంపాస్ కోసం కార్యాలయానికి వస్తున్నారా?’ అంటూ బడంగ్‌పేట్ కార్పొరేషన్ అధికారుల పని తీరుపై మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి(Maheshwaram MLA P. Sabitha Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ, మల్లాపూర్, మామిడిపల్లి గ్రామాల్లోని డివిజన్ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, స్థానికంగా నెలకొన్న సమస్యలపై మంగళవారం మునిసిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
కమిషనర్ పనితీరుతో పాటు ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, తదితర విభాగాల పనితీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ఆమె.. వాటి పరిష్కారంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్పొరేషన్ పరిధిలో పెండింగులో ఉన్న అభివృద్ధి పనుల్లో జాప్యం తగదని, వాటిని సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే సబితారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పి.సరస్వతి, డీఈఈ వెంకన్న, మేనేజర్ నాగేశ్వర్‌రావు, ఏఈ హరీశ్, టీపీవో కిరణ్‌కుమార్, ఏవో అరుణ, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ యాదగిరి, వర్క్ ఇన్‌స్పెక్టర్లు రాకేశ్, వినయ్, సంపత్, కల్యాణ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అంతర్జాతీయ కెమిస్ర్టీ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థికి పతకం
Read Latest Telangana News and National News