Hyderabad: ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం..
ABN , Publish Date - Feb 06 , 2025 | 09:34 AM
మధ్యతరగతి ప్రజలకు చేయూతనిచ్చేలా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని బీజేపీ డివిజన్ అధ్యక్షుడు గూడూరు శైలేష్ రెడ్డి(Gudur Sailesh Reddy) అన్నారు. మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ కూడలిలో బుధవారం ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

హైదరాబాద్: మధ్యతరగతి ప్రజలకు చేయూతనిచ్చేలా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని బీజేపీ డివిజన్ అధ్యక్షుడు గూడూరు శైలేష్ రెడ్డి(Gudur Sailesh Reddy) అన్నారు. మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ కూడలిలో బుధవారం ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోదాసు మాధవి, నిర్మల, సబిత, సతీష్, శ్రీకాంత్‌రెడ్డి, ముత్యంరెడ్డి, శీతల విజయ్ కుమార్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. అల్వాల్ ఈ-సేవ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీజేపీ నేతలు మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: వీసాలేదు.. పాస్‌పోర్టు లేదు.. నగరంలో పట్టుబడ్డ నైజీరియన్
కేంద్ర బడ్జెట్ పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు కలిగించేలా ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు చింతల మాణిక్యరెడ్డి అన్నారు. కార్యక్రమంలో బీజేపీ అల్వాల్ డివిజన్ అధ్యక్షుడు కార్తీక్‌గౌడ్, మచ్చబొల్లారం డివిజన్ అధ్యక్షుడు అజయ్‌రెడ్డి, వెంకటాపురం డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, మల్లిఖార్జున్‌గౌడ్, బాబి, అనిల్‌యాదవ్, లక్ష్మణ్, శ్రీనివాస్, రాజిరెడ్డి, విక్రమ్, రామ్మోహన్, అనిల్, కరణశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: అది అసమగ్ర కులగణన
ఈవార్తను కూడా చదవండి: GHMC: ప్యారానగర్ డంపుయార్డ్ పనులు ప్రారంభం
ఈవార్తను కూడా చదవండి: Mastan Sai: మస్తాన్‌కు డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్!
ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
Read Latest Telangana News and National News