Minister Vivek Venkataswamy: సిద్దిపేటలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్
ABN , Publish Date - Jun 20 , 2025 | 03:13 PM
సిద్దిపేటలో అడ్వాన్స్ టెక్నాలజీతో స్కిల్ డెవలప్‌మెంట్‌ని ప్రారంభిస్తామని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కంకణం కట్టుకుందని వివేక్ వెంకటస్వామి అన్నారు.

సిద్దిపేట జిల్లా: పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కృషి చేస్తోందని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkataswamy) తెలిపారు. ప్రతి ఇందిరమ్మ ఇంటికి తమ ప్రభుత్వం రూ.5లక్షలు ఇస్తోందని అన్నారు. సిద్దిపేట జిల్లాకు 12వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని చెప్పారు. ప్రతి గ్రామంలోని పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. పేదరికాన్ని దూరం చేయాలని ఇందిరాగాంధీ గరీబ్ హటావో పేరుతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చిందని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ పేదలకు మంచి చేయాలనే 200యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నారని పేర్కొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
ఇవాళ(శుక్రవారం) సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి గార్డెన్‌లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మంత్రి వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడారు. సిద్దిపేటలో అడ్వాన్స్ టెక్నాలజీతో స్కిల్ డెవలప్‌మెంట్‌ని ప్రారంభిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హామీలు నెరవేరుస్తారా అని ప్రజల్లో అనుమానం ఉండేదని చెప్పారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక రూ. 8లక్షల కోట్లు అప్పు అయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కంకణం కట్టుకుందని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
తమ ప్రభుత్వం పేదలను ఆదుకోవాలని ఆలోచన చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. మహిళలకు రూ.500లకు గ్యాస్ సిలిండర్, ఉచిత బస్ సౌకర్యం అందిస్తున్నామని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు రూ. 23వేల కోట్ల రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. సుమారు రూ.10వేల కోట్ల రైతు భరోసా నిధులను సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల విడుదల చేశారని తెలిపారు. రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని చెప్పారు. సన్నవడ్లు పండించే రైతులకు ప్రభుత్వం రూ.500ల బోనస్ ఇస్తోందని వెల్లడించారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
అంతకుముందు గజ్వేల్‌లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మంత్రి వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జిల్లా కలెక్టర్ హేమావతి పాల్గొన్నారు. గజ్వేల్‌లో 3వేల డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఎన్నికలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. గృహజ్యోతి కింద 79 వేల మంది లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ అందిస్తున్నామని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
పేదలకు రేషన్‌కార్డ్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. 600 గజాల స్థలంలో ప్రతి నిరుపేద ఇండ్లు కట్టుకునేందుకు తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. విద్య, వైద్యం, ఇండ్లు, రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. 600 గజాల కంటే ఎక్కువ ఇంటి నిర్మాణం ఉండేలా లబ్ధిదారులు చూసుకోవాలని అన్నారు. ఇందిరమ్మ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
విద్యార్థిపై దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వరల్..
రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు బర్త్‌డే శుభాకాంక్షలు
భువనేశ్వరికి చంద్రబాబు బర్త్‌డే విషెస్
Read Latest Telangana News And Telugu News