MP Raghunandan Rao: ఎంపీ రఘునందన్‌రావుని చంపేస్తాం.. మావోయిస్టుల వార్నింగ్
ABN , Publish Date - Jun 23 , 2025 | 02:43 PM
బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావుని చంపేస్తామని పీపుల్స్ వార్ మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసి బెదిరించారు. సోమవారం సాయంత్రంలోగా చంపుతామంటూ ఎంపీని హెచ్చరించారు. తాను మధ్యప్రదేశ్‌కి చెందిన మావోయిస్టునని బెదిరింపులకు పాల్పడ్డాడు.

మేడ్చల్: బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావుని (Medak MP Raghunandan Rao) చంపేస్తామని పీపుల్స్ వార్ మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసి బెదిరించారు. ఇవాళ(సోమవారం) సాయంత్రంలోగా చంపుతామంటూ ఎంపీని హెచ్చరించారు. తాను మధ్యప్రదేశ్‌కి చెందిన మావోయిస్టునని ఓ ఆగంతకుడు ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ ఫోన్ కాల్‌ని రఘునందన్‌రావు పీఏ ఎత్తాడు. 912143352974 నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దమ్ముంటే కాపాడుకోండి అంటూ రఘునందన్‌ని ఆగంతకుడు బెదిరించాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
సోమవారం మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో రఘునందన్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సమయంలోనే రఘునందన్‌రావుకి ఆగంతకుడి నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే రఘునందన్ రావు అప్రమత్తమై తెలంగాణ డీజీపీ జితేందర్‌కి, సంగారెడ్డి ఎస్పీకి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రఘునందన్ రావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్ నెంబర్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఎక్కడ నుంచి ఈ కాల్ వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై బీజేపీ అగ్రనేతలు ఎంపీ రఘునందన్‌రావుకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆ పార్టీ నేతలను రప్పా రప్పా జైలులో వేయాలి: బీజేపీ ఎంపీ
For More Telangana News and Telugu News