Share News

Maoists Letter To Seethakka: మంత్రి సీతక్కకు మావోయిస్టుల మరో లేఖ.. ఈసారి ఏం చెప్పారంటే..

ABN , Publish Date - Jul 05 , 2025 | 05:54 PM

Maoists Letter To Seethakka: మంత్రి సీతక్కకు వార్నింగ్ ఇస్తూ వారం క్రితం మావోయిస్టులు విడుదల చేసిన లేఖ ఇటీవల కలకలం సృష్టించింది. అయితే, ఈ లేఖకు సంబంధించి మావోయిస్టు పార్టీ తాజాగా మరో సంచలన లేఖ విడుదల చేసింది.

Maoists Letter To Seethakka: మంత్రి సీతక్కకు మావోయిస్టుల మరో లేఖ.. ఈసారి ఏం చెప్పారంటే..
Minister Seethakka

వరంగల్: తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Seethakka)ను హెచ్చరిస్తూ వారం క్రితం మావోయిస్టులు విడుదల చేసిన లేఖ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మావోయిస్టు పార్టీ (Maoist Party) ఆ లేఖ తాము రాయలేదంటూ మరో సంచలన లేఖ విడుదల చేశారు.


ఆ లేఖ మేము రాయలేదు..

మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ మావోయిస్టులు రిలీజ్ చేసిన లేఖపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ (Jagan letter) క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో 26.06.2025న మంత్రి సీతక్కకు వచ్చిన లేఖ తాము రాయలేదని జగన్ చెప్పారు. తమ పార్టీకీ, ఆ లేఖకు ఎలాంటి సంబంధం లేదని తాజా లేఖలో స్పష్టం చేశారు. అలాగే మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావ్ లొంగుబాటులో వాస్తవం లేదని తెలిపారు. అణచివేతలతో మావోయిస్టు పార్టీని నిర్మూలించడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో తమ పార్టీ కార్యకలాపాలు లేకపోయినప్పటికీ తమకు సహకారం అందించే ప్రజలపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు చెబుతున్నారని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఆదివాసీలను పోలీస్ స్టేషన్ కు రప్పించి బెదిరింపులకు గురిచేస్తున్నారని.. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.


కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ (Operation Kagar) ఆపాలని, కుమురం భీమ్ జిల్లాలో 339 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించేందుకు తెచ్చిన జీవో నెం.49ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి సీతక్కకు వారం కిందట మావోయిస్టుల పేరుతో విడుదలైన ఓ లేఖ చర్చనీయాంశమైంది. ఆదివాసీ హక్కులను కాలరాస్తూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నా.. ఉద్యమ నేపథ్యం మర్చిపోయి మంత్రి సీతక్క మౌనంగా ఉన్నారంటూ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక మంత్రి పదవిలో ఉండి కూడా ఆ పనులకు అండగా ఉండటంలో విఫలమయ్యారని తీవ్ర విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి

తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు: డిప్యూటీ సీఎం భట్టి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 05 , 2025 | 08:15 PM