Local Body Elections: స్థానిక ఎన్నికలపై బీసీల గురి..!
ABN , Publish Date - Jul 16 , 2025 | 02:20 PM
రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టడంతో వెనుకబడ్డ కులస్థుల (బీసీ) జనాభాపై క్లారిటీ వచ్చింది. మొత్తం రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీ జనాభా ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. దీంతో స్థానిక ఎన్నికలపై ఆ కులాలకు చెందిన ఆశావహులు గురిపెడుతు న్నారు.

జనాభా దామాషా ప్రకారం పెరగనున్న కోటా
గతంలో 22 శాతం రిజర్వేషన్..
ఈసారి 42 శాతం పెంపునకు ప్రభుత్వం ఆర్డినెన్స్
గత ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీల పాగా
పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో వారిదే పై చేయి
మంచిర్యాల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం (Congress Government) కులగణన చేపట్టడంతో వెనుకబడ్డ కులస్థుల (బీసీ) జనాభాపై క్లారిటీ వచ్చింది. మొత్తం రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీ జనాభా ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. దీంతో స్థానిక ఎన్నికలపై ఆ కులాలకు చెందిన ఆశావహులు గురిపెడుతు న్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం బీసీలకు సముచి త స్థానాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. అ సెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి వేదికగా బీసీ లకు ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కసరత్తు చేస్తోంది. అదే సమయంలో తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలం టూ బీసీ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చే స్తున్నాయి. ఈ నేపథ్యంలో గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీసీలు సత్తా చాటిన విషయమై ప్రస్తుతం విస్తృత చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో బీసీలకు 22 శాతమే రిజర్వేషన్ కల్పించగా అప్పటి ఎన్నికల్లో బీసీ కులస్తులు తమ ప్రభావాన్ని చాటారు. ఈ సారి ఎన్ని కల్లో 42 శాతం రిజర్వేషన్‌లను ఆర్డినెన్స్ మార్గంలో అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో బీసీల ప్రాతినిథ్యం మరింతగా పెరుగుతుందన్న అభి ప్రాయా లు వ్యక్తమవుతున్నాయి.
గత ఎన్నికల్లో పెరిగిన బీసీల ప్రాతినిఽథ్యం...
2019 పంచాయతీ ఎన్నికల్లో బీసీలు తమ ప్రాతిని ఽథ్యాన్ని పెంచుకున్నారు. అప్పుడు జరిగిన స్థానిక సంస్థ ల ఎన్నికల్లో ప్రభుత్వం కేవలం 22శాతమే రిజర్వేన్లు క ల్పించినప్పటికీ జనరల్ స్థానాల్లోనూ పోటీచేసి బీసీలు సత్తాచారు. 2019లో జిల్లాలో 311గ్రామపంచాయ తీ లకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. వీటిలో బీసీ రిజర్వుడ్ పంచాయతీలు 49ఉన్నాయి. అవి పోను జన రల్ స్థానాల్లోనూ బీసీలు 83 స్థానాల్లో గెలిచారు. కాగా ఆ ఎన్నికల్లో మొత్తం 132 పంచాయతీలను బీసీలు గెలిచి సత్తా చాటారు.
అలాగే జిల్లాలోని 130 ఎంపీటీసీ స్థా నాలకు గాను 13 స్థానాలు బీసీలకు రిజర్వ్ అయ్యాయి. వాటికి అదనంగా జనరల్ స్థానాల్లోనూ 38సీట్లను బీసీ లు గెలుచుకున్నారు. మొత్తంగా ఎంపీటీసీ స్థానాల్లో 51 సీట్లు గెలిచిన బీసీలు తమ ఆధిపత్యం కొనసాగించా రు. అలాగే జిల్లాలో 16జడ్పీటీసీ స్థానాలకు గాను బీసీ రిజర్వేషన్ స్థానాలు రెండు ఉన్నాయి. ఇవి పోను జన రల్ స్థానాల్లో నాలుగింటిని బీసీలు గెలచుకోగా మొత్తం గా ఆరుగురు బీసీలు జడ్పీటీసీలుగా ఎంపికయ్యారు. కేవలం 22శాతం రిజర్వేషన్‌తోనే గత ఎన్నికల్లో సత్తా చాటిన బీసీలు, ఈసారి దాదాపు రెట్టింపు స్థానాలు రిజ ర్వ్ అయ్యే అవకాశం ఉండటంతో... చట్టసభల్లో తమ ప్రాతినిథ్యం మరింతగా పెంచుకోవాలనే కుతూహలంతో ఉన్నారు.
జనరల్ కోటాలో బీసీల పట్టు...
జిల్లా వ్యాప్తంగా బీసీలు తమ కోటాను మించి గత ఎన్నికల్లో విజయం సాధించగా, రాబోయే ఎన్నికల్లో కూ డా అదే ఒరవడి కొనసాగించేదుకు సన్నాహాల్లో ఉన్నా రు. జిల్లా వ్యాప్తంగా ఈ సారి 306 గ్రామ పంచాయ తీలు (మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో 5 పంచా యతీలు విలీనం అయ్యాయి) ఉండగా జనరల్ కోటాలో నూ తమ పట్టు బిగించేందుకు బీసీలు ఇప్పటి నుంచే సాధ్యా సాధ్యాలపై కసరత్తు ప్రారంభించారు. జిల్లాలోని జనాభాలో 56 శాతానికిపైగా బీసీలు ఉండడంతో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా ప్ర యత్నాలు జరుగుతున్నాయి. బీసీల డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తోంది. ఆర్డినెన్స్ మార్గంలో రాబోయే స్థా నిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు మంత్రి వర్గం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మండలం, జిల్లా, రాష్ట్ర యూనిట్లుగా రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు పంచాయ తీరాజ్ చట్టం-2018కి సవరణలు కూడ చేపట్టబోతోంది.
ఆగస్టులో ఎన్నికల ప్రక్రియ..
ఆర్డినెన్స్ విడుదలకాగానే పంచాయతీరాజ్‌శాఖ రిజ ర్వేషన్లను ఖారారు చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అప్పగించనుంది. ఎన్నికల కమిషన్ ముం దుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ ను విడుదల చేయనుంది. కాగా ఓ వైపు రిజర్వేషన్ల ఖరారుపై పంచాయ తీరాజ్‌శాఖ కసరత్తు చేస్తుండగా, మరోవైపు ఎన్నికల నిర్వహణకూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లలో నిమగ్నమైంది. పంచాయతీరాజ్‌శాఖ చట్ట స వరణఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించిన వెంటనే రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్‌ల ప్రక్రియ పూర్తికా గానే గరిష్టంగా 30 రోజుల్లో పరిషత్, సర్పంచ్ ఎన్నికల ను పూర్తి చేసేందుకు ఎన్నికల కమిషన్ కరసత్తు చేస్తోంది. ఈ లెక్కన ఆగస్టు చివరి వరకు స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, ఆశావహులు టికెట్ల కోసం తమ తమ ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మల్నాడు డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీ విచారణలో సంచలన విషయాలు
హనుమకొండలో మహిళ ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే
Read Latest Telangana News And Telugu News