Medak Blackmail case: సబిల్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
ABN , Publish Date - Jul 24 , 2025 | 08:37 PM
ప్రేమపేరుతో దగ్గరై... యువతిని బ్లాక్‌మెయిల్ చేసిన ఓ యువకుడిని దారుణంగా హత్యచేశారు. హైదరాబాద్ బేగంపేటకు చెందిన సబిల్ హత్య కేసును మెదక్ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈకేసుకి సంబంధించిన వివరాలను మీడియాకు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడించారు.

మెదక్ జిల్లా: ప్రేమపేరుతో దగ్గరై... యువతిని బ్లాక్‌మెయిల్ చేసిన ఓ యువకుడిని దారుణంగా హత్యచేశారు. హైదరాబాద్ బేగంపేటకు చెందిన సబిల్ హత్య కేసును మెదక్ జిల్లా పోలీసులు(Medak District Case) ఛేదించారు. ఇవాళ(గురువారం, జులై24) ఈకేసుకి సంబంధించిన వివరాలను మీడియాకు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడించారు. శివ్వంపేట మండలం మగ్ధంపూర్‌లో ఈనెల(జులై) 21వ తేదీన సాబిల్ హత్య జరిగింది. బోరబండలో ఓ గ్యారేజీలో పనిచేస్తున్నాడు సబిల్.
తాను పని చేసే గ్యారేజీ ఓనర్ కూతురుని ప్రేమించాడు సబిల్. ఫొటోలు చూపించి తనను పెళ్లి చేసుకోవాలని యువతి కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేశాడు సబిల్. పెళ్లి చేయకపోతే ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకి దిగాడు సబిల్. మాట్లాడుదామని చెప్పి సబిల్‌ను మగ్ధంపూర్‌కు యువతి బంధువులు అప్సర్, సంతోష్ తీసుకువచ్చారు. ఫొటోలు ఫోన్‌లో నుంచి డిలీట్ చేయాలని సబిల్‌ని యువతి బంధువులు అప్సర్, సంతోష్ కోరగా.. అందుకు నిరాకరించాడు సబిల్. దాంతో సబిల్‌ను హత్య చేశారు యువతి బంధువులు అప్సర్, సంతోష్. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు
Read latest Telangana News And Telugu News