Share News

CP CV Anand: వారి సహాయంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్ అంటున్న సీపీ

ABN , Publish Date - Jun 20 , 2025 | 03:49 PM

CP CV Anand: వీఐపీ మూమెంట్‌పై ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ముఖ్యమంత్రే తన మూమెంట్ సమయంలో ఎక్కువ సమయం ట్రాఫిక్ ఆపవద్దని ఆదేశాలు ఇచ్చారని.. దీంతో తమకు చాలా ఆనందంగా అనిపించిందన్నారు.

CP CV Anand: వారి సహాయంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్ అంటున్న సీపీ
CP CV Anand

హైదరాబాద్, జూన్ 20: హైదరాబాద్ ట్రాఫిక్ యాక్షన్‌ ప్లాన్‌‌ను సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) వివరించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది వరకు సిటీలో 17 నుంచి 18 కిలో మీటర్ స్పీడ్ ఉండేదని.. ఇప్పుడు 24 నుంచి 25 వరకు యావరేజ్ స్పీడ్ పెరిగిందన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎంతో కష్టపడితే ఈ ఫలితాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. రోజుకు 1600 వాహనాలు పెరుగుతున్నాయన్నారు. ఒక్క రోజుకు మూడు కమిషనరేట్ పరిధిలో 91 లక్షల వాహనాలు రోడ్డుపై ఉంటున్నాయని తెలిపారు. ఆపరేషన్ రోప్ వల్ల మంచి ఫలితాలు వచ్చాయని... ఇంకా దాన్ని బలోపేతం చేస్తామని వెల్లడించారు.


వీఐపీ మూమెంట్‌పై ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నామన్నారు. ముఖ్యమంత్రే తన మూమెంట్ సమయంలో ఎక్కువ సమయం ట్రాఫిక్ ఆపవద్దని ఆదేశాలు ఇచ్చారని. దీంతో తమకు చాలా ఆనందంగా అనిపించిందన్నారు. 80 శాతం హైదరాబాద్‌‌లో సిగ్నల్స్ ఆటో మోడ్ నడుస్తుందని... దీని వలన ట్రాఫిక్ త్వరగా క్లియర్ అవుతుందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలపై జరిమానాల్లో సంఖ్య ప్రాధాన్యత కాకుండా.. క్వాలిటీపై దృష్టి పెట్టి జరిమానాలు విధిస్తున్నామని.. దీంతో ట్రాఫిక్ జరిమానాలు తగ్గాయన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్‌ను డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని సీపీ తెలిపారు.


హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థ‌ను మరింత చక్కదిద్దేందుకు గూగుల్ కంపనీ సహాయం తీసుకుంటున్నామన్నారు. గూగుల్ మ్యాప్స్‌తో పాటు టెక్నికల్‌గా గూగుల్ సపోర్ట్ చేస్తుందని చెప్పారు. నగరంలో ట్రాఫిక్ సిబ్బంది తక్కువగా ఉండడం వలన ట్రాఫిక్ మార్షల్ సిస్టంను తీసుకొస్తున్నామని.. కార్పొరేట్ రెస్పాన్స్‌బులిటీ కింద వారే నియమించుకోవాలన్నారు. ట్రాఫిక్ మార్షల్‌కు తాము ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వారిని ఉపయోగిస్తామని తెలిపారు. ట్రాఫిక్ అసిస్టెంట్‌లుగా విధులు నిర్వహిస్తున్న ట్రాన్స్ జెండర్లు బాగా పని చేస్తున్నారని.. మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.


వచ్చే వర్షా కాలం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పోలీస్ సమన్వయంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. నగరంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు న్యూసెన్స్ చాలా ఎక్కువ ఉందని.. దానిపై కూడా వారి యాజమాన్యాలతో మీటింగ్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

బల్కంపేట ఎల్లమ్మకు నీతా అంబానీ భారీ విరాళం

భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

టేకాఫ్ సమయంలో టెక్నికల్ ఇష్యూ.. నిలిచిన విమానం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 20 , 2025 | 04:43 PM