Share News

Chamala Kiran: కేసీఆర్‌ను విలన్ చేసే ప్రయత్నం..

ABN , Publish Date - Jun 20 , 2025 | 01:25 PM

TG News: కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కేసీఆర్, హరీష్ రావులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డితో నాలుగు సార్లు మంతనాలు జరిపి తెలంగాణ నీళ్లకు అన్యాయం చేసింది కేసీఆర్ అని, హరీష్ రావు వైఖరి వల్లే ఏపీ నేతలు బనకచర్లకు నీళ్ళు తరలించుకుందామనే ఆలోచన చేశారని ఆయన అన్నారు.

Chamala Kiran: కేసీఆర్‌ను విలన్ చేసే ప్రయత్నం..
MP Chamala Kiran

Hyderabad: బీఆర్ఎస్ నేత (BRS Leader) హరీష్ రావు వాళ్ల మామ.. మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) ను విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ (MP Chamala Kiran) ఆరోపించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన గాంధీభవన్‌ (Gandhi Bhavan)లో మీడియాతో మాట్లాడారు. నీళ్ళు అనే పదంతో బీఆర్ఎస్ రాజకీయం (BRS Politics) చేసిందని, బీఆర్ఎస్ నేతలు బేసిక్ నాలెడ్జ్‌తో ప్రాజెక్టులు కడితే బాగుండేదని అన్నారు. కాళేశ్వరం (Kaleshwaram) కూలిన తర్వాత తెలంగాణ ప్రజలకు నీళ్ల సంగతి పూర్తిగా అర్థమైందని, 2016 సీడ్ల్యూసీ మీటింగ్‌లో కేసీఆర్ ఏం మాట్లాడారో చెప్పాలన్నారు. కేసీఆర్‌కు ఉన్న అపరజ్ఞానం వల్లే కాళేశ్వరం కూలేశ్వరం అయిందని విమర్శించారు.


తెలంగాణ నీళ్లకు అన్యాయం చేసింది కేసీఆర్ ..

జగన్ రెడ్డితో నాలుగు సార్లు మంతనాలు జరిపి తెలంగాణ నీళ్లకు అన్యాయం చేసింది కేసీఆర్ అని, హరీష్ రావు వైఖరి వల్లే ఏపీ నేతలు బనకచర్లకు నీళ్ళు తరలించుకుందామనే ఆలోచన చేశారని చామల కిరణ్ అన్నారు. గోదావరి జలాలపై గొంతు చించుకునే బీఆర్ఎస్ నేతలు.. కృష్ణా జలాలపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. హరీష్ రావుకు కంటెంట్ కంటే ఎక్కువ ఆవేశమే ఉందని, బీఆర్ఎస్ నేతలు సీఎం కుర్చీలో రేవంత్ రెడ్డిని చూడలేకపోతున్నారని అన్నారు. నదీ జలాలు ఎవరి అయ్యా జాగీరు కాదని హరీష్ రావు తెలుసుకోవాలన్నారు.


అందుకే ప్రజలు బీఆర్ఎస్‌ను పక్కకు పెట్టారు.

నీళ్ళ అంశంపై తనకు, కేసీఆర్‌కు తప్పా ఎవరికీ ఏం తెలియదని హరీష్ అనుకుంటున్నారని, తెలంగాణ నీటిని ఏపీకి ధారాదత్తం చేసిందే కేసీఆర్ అని చామల కిరణ్ ఆరోపించారు. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే ఈ పంచాయితీ మొదలైందన్నారు. బనకచర్ల విషయంలో కేంద్రం వినకపోతే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి కమిట్‌మెంట్ అర్థం చేసుకోవచ్చునని అన్నారు. బనకచర్లపై ఏకగ్రీవ తీర్మాణం చేద్దామని అనుకునే సమయానికి ఆల్ పార్టీ మీటింగ్ నుండి బీఆర్ఎస్ ఎంపీ వాకౌట్ చేసారన్నారు. బేస్ వదిలి దోచుకునే ప్రయత్నం చేశారు కాబట్టే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారన్నారు. బేసిక్స్ కాదు తమకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టే ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని ఎంపీ చామల కిరణ్ అన్నారు.


ఇవి కూడా చదవండి:

విద్యార్థిపై దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వరల్..

రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు బర్త్‌డే శుభాకాంక్షలు

భువనేశ్వరికి చంద్రబాబు బర్త్‌డే విషెస్

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 20 , 2025 | 01:25 PM