Share News

High Court: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు

ABN , Publish Date - Nov 07 , 2025 | 07:10 PM

హైదరాబాద్‌లో అధ్యాపక సభని శనివారం నిర్వహించాలని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో FATHI లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటీషన్‌పై జస్టీస్ శ్రవణ్ కుమార్ విచారణ జరిపారు.

High Court: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు
High Court

హైదరాబాద్, నవంబరు7 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో చుక్కెదురైంది. హైదరాబాద్‌లో రేపు(శనివారం) నిర్వహించే అధ్యాపక సభకు అనుమతి నిరాకరించింది న్యాయస్థానం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నందున సెక్యూరిటీ ఇవ్వలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో అధ్యాపక సభ అనుమతి కోసం హైకోర్టులో FATHI లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటీషన్‌పై జస్టీస్ శ్రవణ్ కుమార్ విచారణ జరిపారు.


అధ్యాపక సభకు ఎల్బీ స్టేడియం లేదా మరోచోట అయినా ఫర్లేదని అనుమతి ఇవ్వాలని FATHI లాయర్ కోరారు. అయితే, కాలేజీల బంద్‌ని రాష్ట్ర సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది హైకోర్టు. ఈ సభకు అనుమతి ఇవ్వడానికి ఉన్న అభ్యంతరం ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసే వరకు హైదరాబాద్ సిటీలో భారీ సభకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో అధ్యాపక సభకు వారం రోజుల తర్వాత అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి...

మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. వివరాలు ఇవే

గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్.. సమస్యలపై రేవంత్ సర్కార్ ఫోకస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 07 , 2025 | 07:17 PM