Telangana RTC: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
ABN , Publish Date - Mar 07 , 2025 | 10:26 AM
Telangana RTC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంచుతూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు (Telangana RTC Employees) రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) పండగలాంటి వార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2.5 శాతం డీఏ ప్రకటించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ మేరకు ఈరోజు (శుక్రవారం) ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీఏ ప్రకటనతో ప్రతినెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం పడనుంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏలు తక్షణమే చెల్లించేందుకు కూడా సర్కార్ నిర్ణయం తీసుకుంది. డీఏల పెంపుతో 30 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ది చేకూరుస్తున్నట్లు వెల్లడించారు.
కాగా.. ఇటీవల కాలంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 22 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు ఆర్టీసీ ఉద్యోగులు. అందులో ప్రధానమైన డిమాండ్ డీఏ పెంపు. ఈ క్రమంలో డీఏల పెంపుతో ఆ సమస్యకు పరిష్కారం లభించినట్లైంది. ఈ ఉత్తర్వులు ఈరోజు నుంచే అమలులోకి రానున్నాయి. తక్షణమే డీఏ చెల్లించే విధంగా ఆర్టీసీ యాజమాన్యానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. దాదాపు ఎన్నో ఏళ్లుగా డీఏలు పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. డీఏలు పెంచకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు వారికొచ్చే చాలీచాలని జీతాలతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని కార్మిక సంఘాల నేతలు నిత్యం ఆందోళన చేసిన పరిస్థితి. ఈ క్రమంలో ఎట్టకేలకు ప్రభుత్వం రెండున్నర శాతం డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా శక్తి బస్సులు...
అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా రేపు (శనివారం) ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించనుంది సర్కార్. మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా మొదటి దశలో 150 బస్సులు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీలోకి తీసుకొచ్చారు. తరువాత దశలో 450 బస్సులు మొత్తం 600 బస్సులు మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికనకు ఒప్పందం కుదిరింది. ఇందిరా మహిళఆ శక్తి బస్సులను రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఇవి కూడా చదవండి...
Janasena leaders criticize Ambati: వైసీపీ పాకిస్థాన్.. కూటమి ఇండియా.. జనసేన నేతల ఫైర్
CBI: వివేకా వాచ్‌మన్ రంగయ్య మృతిపై కేసు నమోదు
Read Latest Telangana News And Telugu News