Share News

DGP Jitender: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం: డీజీపీ జితేందర్

ABN , Publish Date - Jun 21 , 2025 | 04:18 PM

తెలంగాణ రాష్ట్రంలో దురదృష్టవశాత్తూ యువత డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని తెలంగాణ డీజీపీ జితేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మెంటల్ హెల్త్‌తో పాటు ఫిజికల్ హెల్త్‌ను నాశనం చేస్తుందని డీజీపీ జితేందర్ చెప్పారు.

DGP Jitender: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం: డీజీపీ జితేందర్
Telangana DGP Jitender

హైదరాబాద్: డ్రగ్స్‌పై (Drugs) ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ డీజీపీ జితేందర్ (Telangana DGP Jitender) హెచ్చరించారు. డ్రగ్స్ వల్ల చాలా అనర్ధాలు జరుగుతాయని అన్నారు. యవత వీటి బారిన పడొద్దని.. విలువైన జీవితాన్ని కోల్పోవద్దని సూచించారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రభుత్వం, పోలీసులు కృతనిశ్చయంతో పని చేస్తున్నారని అన్నారు. ఇవాళ(శనివారం) తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో డ్రగ్స్ అవేర్నెస్ వీక్‌ని డీజీపీ జితేందర్ ప్రారంభించారు. జూన్ 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ నిర్వహిస్తున్నారు.


వారోత్సవాల్లో భాగంగా డ్రగ్స్ వినియోగం వల్ల వచ్చే అనర్ధాలపై విద్యార్థులకు నార్కోటిక్ బ్యూరో అవగాహన కల్పించనుంది. డ్రగ్ అవేర్నెస్ వీక్‌లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య, వివిధ కళాశాలల విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో దురదృష్టవశాత్తూ యువత డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మెంటల్ హెల్త్‌తో పాటు ఫిజికల్ హెల్త్‌ను నాశనం చేస్తుందని చెప్పారు. విద్యార్థులు మీ జీవితం అనే పుస్తకంలో మంచి విషయాలు మీరే రాసుకోవాలని సూచించారు. నో టు డ్రగ్స్ అనే నినాదం జనాల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల్లో ఒక్కో విద్యార్థి పదిమందికి సే నోటు డ్రగ్స్ అని చెప్పాలని డీజీపీ జితేందర్ కోరారు.


మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దు:సందీప్ శాండిల్య

విద్యార్థుల మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. విద్యార్థులతో యాంటీ డ్రగ్ సోల్జర్స్‌గా సందీప్ శాండిల్య ప్రమాణం చేయించారు. డ్రగ్స్ వ్యతిరేకంగా పని చేస్తామని, మాదక ద్రవ్యాల జోలికి వెళ్లమని విద్యార్థులు ప్రమాణం చేశారు.


విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: కలెక్టర్ హరిచందన

పాఠశాలల్లో డ్రగ్స్‌ని గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన సూచించారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్‌కి వ్యతిరేకంగా పని చేస్తామని విద్యార్థులతో కలెక్టర్ హరిచందన ప్రమాణం చేయించారు. సే నోటు డ్రగ్స్ అనే నినాదం అందరికీ చేరేలా చేయాలని అన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం విద్యార్థులు అందరూ పని చేయాలని కలెక్టర్ హరిచందన కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

సిట్‌ ముందుకు ప్రణీత్ రావు.. 650 ఫోన్ల ట్యా‌ప్‌పైనే విచారణ

యోగా డేలో తొక్కిసలాట.. స్పృహకోల్పోయిన యువతి

భార్యపై అనుమానం.. బిడ్డలపై ఘాతుకం... రవిశంకర్ అరెస్ట్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jun 21 , 2025 | 04:25 PM