Share News

Dogs ​​Attack in Hyderabad: హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడి.. పలువురికి గాయాలు

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:39 AM

ఇటీవల తెలంగాణ రాష్ట్రంతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో పలువురిపై వీధికుక్కలు దాడి చేసి గాయపరిచిన సంఘటనలు ఉన్నాయి. కుక్కలు ఎక్కడ దాడిచేస్తాయోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా జీడిమెట్ల, బాలానగర్ పరిధిలో వీధికుక్కులు బీభత్సం సృష్టించాయి.

Dogs ​​Attack in Hyderabad: హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడి.. పలువురికి గాయాలు
Dogs ​​Attack in Hyderabad

హైదరాబాద్, నవంబరు9 (ఆంధ్రజ్యోతి): జీడిమెట్ల (Jeedimetla), బాలానగర్ (Balanagar) పరిధిలోని పలు కాలనీలు, బస్తీల్లో వీధి కుక్కలు (Stray Dog Attack) ప్రజలను తీవ్రంగా భయపెడుతున్నాయి. ఇవాళ(ఆదివారం) ఉదయం సుమారు 7 గంటల సమయంలో జీహెచ్ఎంసీ (GHMC) మహిళా కార్మికులు విధులు నిర్వర్తిస్తుండగా కుక్కల గుంపు దాడి చేసి పలువురిని గాయపరిచిన ఘటన సంచలనంగా మారింది.


ఇవాళ ఒక్కరోజే ఈ ప్రాంతంలో దాదాపు 20 మందిపై వీధి కుక్కలు దాడి చేసినట్లు తెలుస్తోంది. బాధితులను సమీప ఆస్పత్రికి తరలించి యాంటీ రేబీస్ ఇంజెక్షన్లు వేశారు. ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, మహిళలు ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి కుక్కలని పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


కాగా, ఇటీవల తెలంగాణ రాష్ట్రంతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో పలువురిపై వీధికుక్కలు దాడి చేసి గాయపరిచిన సంఘటనలు ఉన్నాయి. కుక్కలు ఎక్కడ దాడిచేస్తాయోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కుక్కలు గాయపరచడంతో పలువురు రేబీస్ వ్యాధితో ఆందోళనకు గురువుతున్నారు. కుక్కల గుంపులు ఉంటే ప్రజలు ఆ దారిలో వెళ్లడానికి కూడా జంకుతున్నారు. చిన్నారులు ఒంటరిగా ఉంటే కుక్కలు దాడి చేసి గాయపరుస్తున్నాయి. వీధి కుక్కలని కట్టడి చేయాలంటే ప్రజలకు తలకు మించిన భారం అవుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే కుక్కలని పట్టుకోవాలని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం

రేవంత్ పాలనలో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది.. హరీశ్‌రావు ఫైర్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 09 , 2025 | 12:08 PM